హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9 : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి పోటీకి ముగ్గురు బీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులకు సమర్పించారు. కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నామినేషన్ల దాఖలు కంటే ముందు ఎమ్మెల్సీ అభ్యర్థులు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.




