ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 25 : ఆమనగల్లు పట్టణంలో ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు 11 రోజులపాటు నిర్వహించే దసరా శరన్నవరాత్రోత్స వాలు వైభవంగా భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అధ్యక్షుడు వీరబొమ్మ రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి బికుమండ్ల నరసింహ, కోశాధికారి బికుమండ్ల శ్రీనివాస్ లతో కలిసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం శ్రీ దుర్గాదేవి దేవి గా అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదానం చేశారు. అనంతరం అమ్మవారిని పురవీధుల గుండా ఊరేగించారు. దీంతో ఉత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్, వాసవి సీనియర్ సిటిజెన్ క్లబ్, ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షులు కండే లింగయ్య, ఓంకారం, రామ్మోహన్, బి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన కన్యకా పరమేశ్వరి దసరా శరన్నవరాత్రోత్సవాలు




