ముగిసిన ఐదవ దశ ఎన్నికలు

  • 6 రాష్ట్రాలు, రెండు యూటీలలో 49 స్థానాల్లో పోలింగ్‌ పూర్తి
  • వోటు వేసిన రాజ్‌నాథ్‌, పీయూష్‌ గోయల్‌,
  •  స్మృతి ఇరానీ, రాహుల్‌ గాంధీ తదితరులు
  • 56 శాతానికి పైగా పోలింగ్‌ నమోదు
  • 25న 6వ దశ పోలింగ్‌

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మే 20 : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం దేశ వ్యాప్తంగా 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో కలిసి మొత్తం 49 స్థానాలలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ 49 స్థానాలలో 4.69 కోట్ల పురుషులు, 4.26 కోట్ల మంది మహిళలు మరియు 5,409 మంది థర్డ్‌ జెండర్‌ వోటర్లు సహా మొత్తం 8.95 కోట్ల మంది వోటర్లు ఉన్నారు. మొత్తంగా 56 శాతం పైగా పోలింగ్‌ నమోదయినట్లు సమాచారం. మొత్తం 49 లోక్‌సభ స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌ నుంచి 14, మహారాష్ట్ర నుంచి 13, పశ్చిమ బెంగాల్‌ నుంచి 7, బీహార్‌ నుంచి 5, జార?ండ్‌ నుంచి 3, ఒడిశా నుంచి 5, జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌ నుంచి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. వీటిలో కేంద్ర మంత్రులు  రాజ్‌నాథ్‌ సింగ్‌, స్మృతి ఇరానీ, పీయూష్‌ గోయల్‌తో సహా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, జెకెఎన్‌సి చీఫ్‌ ఒమర్‌ అబ్దుల్లా, ఆర్‌జేడీ నాయకుడు రోహిణి ఆచార్య వంటి ప్రతిపక్ష నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఉన్నాయి.

ఐదో దశలో మొత్తం 695 మంది అభ్యర్థుల్లో 82 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఐదు దశలో పోటీ చేసే మొత్తం అభ్యర్థుల్లో 122 మంది  అభ్యర్థులపై అంటే దాదాపు 18 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు పెండిరగ్‌లో ఉన్నారు. సుధీర్ఘకాలం పాటు గాంధీ కుటుంబం  ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ నుంచి ఈ సారి తన రెండవనియోజకవర్గంగా రాహుల్‌ గాంధీ బరిలో నిలువగా, అమేథీ నుంచి సిట్టింగ్‌ ఎంపి, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మళ్లీ పోటీ పడుతున్నారు. 2019 ఎన్నికల్లో ఆమె ఇదే నియోజకవర్గం నుంచి రాహుల్‌ గాంధీపై విజయం సాధించిన విషయం విధితమే. తన వోటు హక్కును వినియోగించుకున్న అనంతరం రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గంలోని పలు పోలింగ్‌ బూత్‌లకు వెళ్లి వోటింగ్‌ సరళిని పరిశీలించారు.

కాగా అక్కడి జనాభాలో దాదాపుగా 46 శాతం ముస్లింలు, 39 శాతం బౌద్ధులు ఉన్న హిమాలయ భూభాగంలోని లడక్‌ వాసులు తమ రాజ్యాధికారం కోసం, స్థానిక సంస్కృతి పరిరక్షణ కోసం డిమాండ్‌ చేస్లున్నారు. స్వంత శాసన సభను, దుర్బలమైన వాతావరణ పరిస్థితుల నుంచి రక్షించడానికితగు చర్యల కోసం వారు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. కేందప్రాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు మోదీ ప్రభుత్వం లడక్‌ను స్థానిక గిరిజన ప్రజలు తమ స్వంత చట్టాలను, విధానాలను రూపొందించుకోవడానికి అవకాశమిచ్చే ఆరవ షెడ్యూల్‌లోకి చేర్చుతామనే తమ హమీని ఇప్పటికీ నెరవేర్చ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *