ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 14 : కడ్తాల మండలంలోని హనుమాస్ పల్లి గ్రామపంచాయతీ కి చెందిన మధు కు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ. 38, వేల చెక్కును గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ చేతుల మీదుగా మధుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ సేవ్య నాయక్, ఉప సర్పంచ్ శారద పాండు నాయక్, మహేష్, పాండు, కిషన్, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేసిన జెడ్పిటిసి దశరథ్ నాయక్





