ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ ‌భవనాన్ని ప్రారంభించనున్నారు. సెప్టెంబర్‌ 5‌న నిజామాబాద్‌ ‌జిల్లా కలెక్టరేట్‌ను, సెప్టెంబర్‌ 10‌న జగిత్యాల కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ‌ప్రారంభించనున్నారు.

టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన అనంతరం.. అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు జిల్లాల్లో కార్యాలయాలు ప్రజలకు అందుబాటులోకి రాగా.. మరికొన్ని ప్రారంభానికి సిద్ధమయ్యాయి. సీఎం కేసీఆర్‌ ‌పర్యటన నేపథ్యంలో అధికారులు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *