ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ముంబై, డిసెంబర్‌ 15 : ‌ముంబయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పారెల్‌ ‌ప్రాంతంలో గల అవిఘ్న పార్క్ ‌హౌసింగ్‌ ‌సొసైటీలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో 14వ ప్లోర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని నాలుగు ఫైర్‌ ఇం‌జన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

అగ్ని ప్రమాదం కారణంగా అవిగ్నాన్‌ ‌పార్క్ ‌భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించారు.  అపార్ట్ ‌మెంట్‌?‌లో నివసిస్తున్న వారిని కిందకు దించారు. ముందు జాగ్రత్త చర్యగా ఘటనా స్థలంలో అంబులెన్స్ ‌ను కూడా ఉంచారు. మరోవైపు అగ్ని ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే దట్టమైన పొగ వల్ల చుట్టు ప్రక్కల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *