ముంబైలో భారీగా డ్రగ్స్ ‌పట్టివేత

ఎయిర్‌పోర్టులో రూ. 25 కోట్లు విలువ చేసే కొకైన్‌ ‌స్వాధీనం
ముంబై,మార్చి1: ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అం‌తర్జాతీయ విమానాశ్రయంలో 2.58 కిలోల  అంటే రూ. 25 కోట్లు విలువ చేసే కొకైన్‌ 12 ‌సోప్‌ ‌బార్లు పట్టుబడ్డాయి. ఇథియోపియా అడిస్‌ అబాబా నుంచి వచ్చిన వ్యక్తి ట్రాలీ బ్యాగ్‌లో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. ఆ వ్యక్తితో పాటు అతనికి సహాయకుడిని అదుపులోకి డీఆర్‌ఐ అధికారులు తీసుకున్నారు.

అతడు ఎక్కడికి తీసుకు వెళుతున్నాడు? ఎవరికి చేరవేయబోతున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. దేశంలో డ్రగ్స్ అ‌క్రమ రవాణాపై డీఆర్‌ఐ, ‌నార్కోటిక్స్ అధికారులు, ఎయిర్‌ ‌పోర్ట్ ‌లలో కస్టమ్స్ అధికారులు ఎక్కడికక్కడ ఉక్కు పాదం మోపుతున్నారు. అయినా డ్రగ్స్ ‌దందా చాప కింద నీరులాగా సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *