ముంబై, జనవరి 24 : ముంబై ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు ప్యాసింజెర్ల నుంచి భారీగా అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి 90వేల అమెరికా డాలర్లను సీజ్ చేశారు. అమెరికా డాలర్ల నోట్లను పుస్తకాల్లో తీసుకువస్తున్న ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు వేర్వేరు కేసుల్లో ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 22, 23వ తేదీల్లో ఈ ఘటనలు జరిగాయి. ఆ ప్రయాణికులు ఇద్దరూ విదేశీయులే. పుస్తకాల్లో డాలర్ల నోట్లను పట్టుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా ఆ ప్రయాణికుల నుంచి 2.5 కేజల బంగారాన్ని కూడా సీజ్ చేశారు.
పేస్ట్ రూపంలో వాళ్లు ఆ బంగారాన్ని తీసుకువచ్చారు. తమిళనాడు: తమిళనాడు రాష్ట్రం వెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త నడిరోడ్డుపై దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సోమవారం రాత్రి వెల్లూరులోని రద్దీ రహదారిపై ఓ వ్యక్తి తన భార్యను పలుమార్లు కత్తితో దారుణంగా పొడిచాడు. దీంతో ఆమె అక్కడే కుప్పకూలి మృతి చెందింది. రోడ్డుపై వెళ్తున్న ప్రజలు ఈ దారుణాన్ని చూస్తున్నారే గానీ, ఆపడానికి ఎవరూ ప్రయత్నించకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సపంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



