మీ ఆశీస్సులందించి సహకరించండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 9: పటాన్ చెరు కాంగ్రెస్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ముందుకు వెళ్తానని మీ అందరి ఆశీస్సులు అందించి సహకరించాలని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం పటాన్ చెరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను, ముఖ్య నాయకులను కలిసి మద్దతు అభ్యర్థించారు. మీ అందరి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తానని, అందరి తోడ్పాటుతో ఎన్నికల క్షేత్రంలో ముందుకు వెళ్తానని తెలిపారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం తనకు టిక్కెట్ కేటాయించిందన్నారు.గతం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ప్రతి నాయకుడు, కార్యకర్త ఆశయాలకు తగ్గట్లు పనిచేస్తూ అందరిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. సోనియమ్మ ఆశలను నిజం చేయడానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కాంగ్రెస్ కుటుంబంలోకి అడుగుపెట్టిన తనకు మీ అందరి సహాయ సహకారాలు కావాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *