మీ ఆశీర్వాద బలమే పైలట్ విజయానికి పునాది

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 21:  మీ ఆశీర్వాద బలమే తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విజయానికి పునాది అని  ఆయన సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తాండూరు పట్టణంలోని 27వ వార్డులో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున సతీమణి ఆర్తి రెడ్డి చేసిన ప్రచారానికి వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వార్డులో ఆర్తీ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ కరపత్రాలను పంచి కారు గుర్తును గుర్తించుకోవాలన్నారు. ప్రజల ఆశీర్వాదంతో, యువకులు అభిమానంతో ఓటేసి ఎన్నికల్లో రోహిత్ రెడ్డికి భారీ మెజార్టీ అందించాలన్నారు. కాంగ్రెస్ మాటలను నమ్మి దగా పడి ఇబ్బంది పడద్దని సూచించారు. ప్రజా ఆశీర్వాదమే పైలెట్ రోహిత్ రెడ్డి విజయానికి పునాదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ వీణా శ్రీనివాస్ చారి, కౌన్సిలర్ సంగీత ఠాకుర్ తదితులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *