మీ అంకిత భావం సమాజానికి ఆశ, బలాన్ని ఇస్తుంది

డాక్టర్ల దినోత్సవం  సందర్భంగా వైద్యులకు ప్రధాని శుభాకాంక్షలు
న్యూ దిల్లీ, జూలై 1 : జూలై 1వ తేదీ డాక్టర్ల దినోత్సవం  సందర్భంగా ప్రధాని మోడీ తన ట్వీట్‌లో డాక్టర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్వీట్‌లో ‘డాక్టర్స్ ‌డే సందర్భంగా మొత్తం వైద్యుల సంఘానికి నా ప్రగాఢ కృతజ్ఞతలు. మహమ్మారి సమయంలో వైద్యులు ధైర్యానికి, నిస్వార్థతకు, స్థితిస్థాపకతకు ఉదాహరణగా నిలిచారు.

వారి అంకితబావం వైద్యం కంటే మించినది. ఇది సమాజానికి ఆశ, బలాన్ని ఇస్తుంది’ అని పేర్కొన్నారు. కాగా, ప్రముఖ వైద్యుడు, విద్యావేత్త, స్వాతంత్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు అయిన డాక్టర్‌ ‌బిధాన్‌ ‌చంద్రరారు జయంతి సందర్భంగా డాక్టర్ల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *