- ట్రంప్ సుంకాలపై జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు
– న్యూదిల్లీ సదస్సులో పాక్, అమెరికాల బంధంపైనా కామెంట్స్
న్యూదిల్లీ, ఆగస్ట్ 23: రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు విధించడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఘాటుగా స్పందించారు. భారత్ నుంచి చమురు, రిఫైన్డ్ ఉత్పత్తులు కొనుగోలుపై ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడి ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యాపార అజెండాతో సాగుతున్న అమెరికా యంత్రాంగానికి మద్దతిస్తున్న కొన్ని దేశాలు ఇతరులపై నిందలు వేసే ప్రయత్నాలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిలా విదేశాంగ విధానాన్ని ఇంత బహిరంగంగా నిర్వహించిన ఏ అధ్యక్షుడిని గతంలో చూడలేదన్నారు. వాణిజ్య అంశాలతో పాటు వాణిజ్యేతర వ్యవహారాలకు టారిఫ్‌లు వినియోగిస్తుండటం కొత్తగా ఉందని ఉన్నారు. ఒక్క భారత్‌తోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలతో ఆయన డీల్ చేస్తున్న విధానం ఇలాగే ఉందన్నారు. వాణిజ్య సుంకాలను 50 శాతానికి పెంచుతున్నట్టు ట్రంప్ ప్రకటించడానికి ముందు రష్యా చమురు అంశం గురించి అమెరికాతో తామెలాంటి చర్చలు జరపలేదని ఎనకానిక్ -టైమ్ ఆధ్వర్యంలో దిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో జైశంకర్ తెలిపారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. భారత్‌తో ఘర్షణపూరిత వాతావరణాన్ని కొనసాగిస్తున్న వేళ.. పాకిస్థాన్-అమెరికా మధ్య స్నేహం ఇటీవల పెరుగుతున్నట్లు-కనిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాల సంబంధాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాలకూ ఓ చరిత్ర ఉందని, గతాన్ని విస్మరించిన చరిత్ర కూడా వారిదేనన్నారు. ఈ సందర్భంగా ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చిన ఘటనను ఉటంకిస్తూ.. అమెరికా సైన్యం అబోటాబాద్‌లో జరిపిన ఆపరేషన్‌ను గుర్తుచేశారు. ఆ రెండు దేశాలకు పరస్పర చరిత్ర ఉంది. అంతేకాదు.. గతాన్ని విస్మరించిన చరిత్ర కూడా వారిదే. ఇటువంటివి మనం చూడటం కొత్త కాదు. ఇదే అమెరికా సైన్యం అబోటాబాద్ వెళ్లి ఎవర్ని గుర్తించిందో మనందరికీ తెలుసు‘ అని జైశంకర్ పేర్కొన్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై సెప్టెంబర్ 11నాటి దాడికి సూత్రధారి బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుపెట్టిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పలు దేశాల సైన్యాలు ఏవిధంగా పని చేస్తున్నాయనే విషయంపై జై శంకర్ మాట్లాడుతూ.. కొన్ని దేశాలు అవకాశవాద రాజకీయాలపై దృష్టి పెట్టినప్పుడు.. అవి అలా చేస్తూనే ఉంటాయి. అందులో కొన్ని వ్యూహాత్మకంగా లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉండవచ్చని అన్నారు. ఇలాంటివి చూస్తున్నప్పుడు అమెరికాతో మనకు ఉన్న బలమైన సంబంధాలు ఏంటీ ఏవి ముఖ్యమైనవనే అంశాలపైనా భారత్ దృష్టి సారిస్తుందన్నారు.
మరోవైపు అమెరికా కోసమే తాము ఉగ్రవాదులను పెంచి పోషించామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల అంగీకరించిన విషయం తెలిసిందే. పహల్గాం దాడి తర్వాత భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తతలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు- తాము చెత్త పనులన్నీ చేస్తున్నామని అన్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డామని, చివరకు అది పొరబాటు- అని అర్థమైందన్నారు. ఈ క్రమంలోనే పాక్ సైన్యాధికారి ఇటీ-వల రెండుసార్లు వాషింగ్టన్లో పర్యటించడం, తదనంతరం ట్రంప్ యంత్రాంగం పాక్‌పై సానుకూల ధోరణి అవలంబించడం ఆ రెండు దేశాల సాన్నిహిత్యాన్ని స్పష్టం చేస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





