మిల్లెట్లపై జిఎస్‌టి తగ్గింపు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్స్, అక్టోబర్‌ 7 : ‌మిల్లెట్లపై జిఎస్‌టి తగ్గిస్తూ జిఎస్‌టి కౌన్సిల్‌ ‌నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌తెలిపారు. ప్యాకేజ్‌డ్‌ ‌మిల్లెట్ల పిండిపై 5 శాతం, లూజుగా విక్రయిస్తే జిఎస్‌టి వర్తించదని ఆమె తెలిపారు. ఇంతకుముందు దీనిపై 18 శాతం జిఎస్‌టి ఉండేది. కనీసం 70 శౄతం మిల్లెట్లతో కూడిన పిండిని టూజుగా వికర్యఇస్తే ఎలాంటి జిఎస్‌టి వర్తించదని నిర్మల తెలిపారు.

శనివారం దిల్లీలో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్‌ ‌సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను నిర్మల మీడియాకు వెల్లడించారు. ఇక మొలాసిస్‌పై జిఎస్‌టిని 28 శాతం నుంచి 5 శాతంకు తగ్గిస్తూ కౌన్సిల్‌ ‌నిర్ణయం తీసుకుంది. దీని వల్ల చెరుకు రైతులకు మేలు చేకూరుతుందని తెలిపారు.మానవ అవసరాలకు వినియోగించే డిస్టిల్‌ ఆల్కహాల్‌ను జిఎస్‌టీ నుంచి మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా జిఎస్‌టి అప్పిలేట్‌ ‌ట్రిబ్యునల్‌ ‌ప్రెసిడెంట్‌ ‌గరిష్ట వయస్సును ప్రస్తుత 67 ఏళ్ల వయసు నుంచి 70 ఏళ్లకు, సభ్యుల గరిష్ట వయస్సును ప్రస్తుత 65 ఏళ్ల వయసు నుంచి 67 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *