మినరల్‌ ‌వాటర్‌ ‌వ్యాపారంలో వ్యాపారుల ఇష్టారాజ్యం

‘‘ఈరోజు ఎదగాల్సిన చిన్న పిల్లలలో కాల్షియం స్థాయి తగ్గిపోయి ఎముకలు బలహీన పడుతున్నాయి. సాధారణ నీటిలో పిహెచ్‌ ‌స్థాయి సుమారు 65 నుంచి 85 వరకు సాధారణ స్థాయిలో ఉండాలి. సాధారణ మిషన్‌ ‌భగీరథ లాంటి నీటిలో డిడిఎన్‌ 150 ‌మినరల్స్ ఉం‌డే ఆర్వో ప్లాంట్‌ ‌నీటిలో కనీసం 60కి మించి ఉండవు. లవణాలు తొలగించిన నీటిని రుచిగా మార్చేందుకు ఎసెన్స్ ‌లాంటి రసాయనలను మిశ్రమం చేసి ప్రజా ఆరోగ్యానికి ముప్పు తీసుకొస్తున్నారు. దీనివల్ల యువకుల్లో మోకాళ్ళ నొప్పులు, ఎముకల నొప్పుల లాంటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఆర్వో మంచినీటి వాటర్‌ ‌ప్లాంట్‌ ‌ను అధికారులు పర్యవేక్షణ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలి.’’
అతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందాలనే తప నతో కొందరు, కష్ట పడకుండానే పైసలు సంపా దించాలనే ఆశతో మరి కొందరు మినరల్‌ ‌వాటర్‌ ‌వ్యాపారంలో కొందరు – తాగునీటి’ పేరు మీద లక్షలు సంపాదిస్తున్నారు. ఒకప్పుడంటే చాలా మంది బావుల్లో, చెరువుల్లో, నదుల్లో మంచినీటిని తాగేవారు. కానీ ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ ప్రజలు మారుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా మినరల్‌ ‌వాటర్‌ ‌హవా నడుస్తోంది. ప్రతి ఒక్కరూ వాటర్‌ ‌బాటిల్‌, ఇం‌ట్లో మంచినీటి వాటర్‌ ‌క్యాన్‌   ‌కొనుక్కొని తాగాల్సి పరిస్థితి వస్తోంది. పట్టణాలలో, పల్లెటూరులో, గల్లీలో ఆర్వో వాటర్‌ ‌ప్లాంట్‌ ‌పుట్టగొడుగుల్లా పుట్టుకొ స్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర సర్కార్‌ అనుమతులు లేకుండానే కొన్ని చోట్ల కొందరు మంచినీటి వ్యాపారంతో లక్షల రూపాయల లాభాలు ఆర్జిస్తూ  సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారని వినికిడి.
నీటి శుద్ధిలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండనే ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ప్యూరీఫైడ్‌  ‌శుద్ది పేరిట విచ్చలవిడిగా రసాయనాలను వాడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చి పెడుతున్నారు. వాటర్‌ ‌ప్లాంట్‌ ‌నిర్వాహకులు నీటిని నామమాత్రంగా శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ప్రజలు కూడా మినరల్‌ ‌వాటర్‌కు అలవాటు పడడంతో .. మోసం చేయడం వ్యాపారుల వంతు అవుతుంది. అత్యధిక శాతం కుటుంబాలు మినరల్‌ ‌వాటర్‌ ‌తాగడానికి అలవాటు పడటం వ్యాపారులకు వరంగా మారింది. అంతే కాకుండా సంభందిత అధికారులు ప్రతి  వాటర్‌ ‌ప్లాంట్‌ ‌లో? వారానికోసారి మంచినీటిని ? టెస్ట్? ‌చేయించాల్సి ఉంటుంది. వాటర్‌ ‌ప్లాంటు నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వాటర్‌ ‌ప్లాంటు నిర్వహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అడ్డూ అదుపు లేని ధరలతో సామాన్యులకు తాగునీటిని అందని ద్రాక్షగా మార్చేస్తున్నారు.  మంచినీటి త్రాగడం కోసం ప్రజలు జోరు అందుకుంటున్నారు. చాలా చోట్ల బోరు నీటిని శుద్ధి చేసి ప్యూరిఫ్యై  వాటర్‌ ‌గా విక్రయిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యాలతో వాటర్‌ ‌ప్లాంట్‌ ‌నిర్వాహకులు చెలగాటం ఆడుతుంటే సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్కడైనా తాగునీటిని శుద్ధి చేసే ఆర్వో ప్లాంట్‌  ఏర్పాటు చేయాలంటే సుమారు 15 రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ప్రధానంగా బ్యూరో ఇండియన్‌ ‌స్టాండర్డస్ ‌నుంచి ఐఎస్‌ఐ 14543 ‌సర్టిఫికెట్‌ ‌పొందాల్సి ఉంటుంది. ఈ రకమైన సర్టిఫికెట్‌ ‌ను పొందిన ఆర్వో ప్లాంట్‌ ‌ను సంబంధించిన అధికారులు పర్యవేక్షణ చేస్తూ, మంచినీటి శుద్దిని పరిశీలించాలి. దీంతో సర్కారుకు ఆదాయం  చేకూరుతుంది. అదే విధంగా పరిశ్రమల శాఖ నుంచి స్మాల్‌ ‌స్కేల్‌ ఇం‌డస్ట్రీస్‌ ఎస్‌ఎస్‌ఐ అనుమతి ఉండాలి. పొల్యూషన్‌ ‌కంట్రోల్‌ ‌బోర్డు సర్టిఫికెట్‌ ‌పొందాల్సి ఉంటుంది. శుద్ధి చేసిన బోరు నీటిని ఒకటికి రెండు సార్లు, రెండు మూడు ల్యాబ్‌ ‌లలో పరీక్షీంచాల్సి ఉంటుంది. వీటితో పాటుగా పెస్ట్ ‌కంట్రోల్‌ ‌సర్టిఫికెట్‌ , ‌రిజిస్టర్‌ ఆఫ్‌ ‌ట్రేడ్‌ ‌మార్క్, ఎలక్ట్రికల్‌ ‌లోడ్‌ ‌మంజూరు , లే ఔట్‌ ‌ప్లాన్‌, ఓనర్‌ ‌షిప్‌,  ‌లీజు సర్టిఫికెట్‌ ‌లను తదితర సర్టిఫికెట్‌ ‌కలిగి ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా  ఇలాంటి నిబంధనలను ఏ ఒక్క వాటర్‌ ‌ప్లాంట్‌ ‌లో కూడా అమలు చేయడం లేదు.  ఏదో ఒక చోట తుతూ మంత్రంగా అమలు చేస్తున్నట్లు అధికారులకు చూపించి చేతులు దులుపుకుంటున్నారు.
ఆర్వో మంచినీటి వాటర్‌ ‌ప్లాంట్‌ ‌లో మెడికల్‌ ‌డిపార్ట్మెంట్‌ ‌నుంచి డిగ్రీ పట్టా పొందిన కెమిస్ట్రీ మైక్రోబయాలజీస్ట్ ‌నియమాకం  తప్పనిసరిగా  చేయాల్సి ఉంటుంది. నీటిని శుద్ధి చేసేముందు ( రా వాటర్‌ ), ‌శుద్ది చేసిన తర్వాత ప్యూరిఫైడ్‌ ‌నీటి నమునాలను పరీక్షించి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మార్కెటింగ్‌ ‌కు అనుమతించాలా ? వద్దా ? అనే విషయాన్ని వారు  నిర్ణయిస్తారు. అయితే కనీసం ఎక్కడ కూడా కెమిస్ట్రీ మైక్రోబయాలజిస్ట్ ‌లేకపోవడంతో వాటర్‌ ‌ప్లాంటు నిర్వహకులే కెమిస్ట్రీ మైక్రోబయాలజీస్ట్ అవతారం ఎత్తుతున్నారు. మంచినీటి శుద్ధి ప్రక్రియపై కనీస అవగాహన లేని వ్యక్తులు వాటర్‌ ‌ప్లాంటు ను నిర్వహిస్తూ ప్యూరీఫైడ్‌ ‌పేరిట విచ్చలవిడిగా రసాయనాలను వాడుతున్నారు.  రోజురోజుకు మినరల్‌ ‌వాటర్‌ ‌ప్రజలు తాగుతున్న కొద్ది, వాటర్‌ ‌ప్లాంట్‌ ‌నిర్వాహకులు  ధరలు మాత్రం పెంచేస్తున్నారు. ఒకప్పుడు 20 లీటర్ల క్యాన్‌ ‌వాటర్‌ ‌కు కేవలం 2 రూపాయలు నుండి  5 రూపాయలు  ఉండగా,  ప్రస్తుతం దానిని 15 రూపాయల నుండి 30 రూపాయల వరకు పెంచెసారు. నాణ్యత ప్రమాణాలు పాటించని ఆర్వో ప్లాంట్‌ ‌పై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వాటర్‌ ‌ప్లాంట్‌ ‌నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు.
రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలలో, పట్టణ కేంద్రాలలో, గ్రామీణ ప్రాంతాలలో, గల్లీలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆర్వో మంచినీటి వాటర్‌ ‌ప్లాంట్‌ ‌ద్వారా సరఫరా అయ్యే నీటితో అనేకమైన ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని,  వైద్యరంగ నిపుణులతో పాటు కెమిస్ట్రీ కన్సల్టెంట్‌ ‌హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఆర్వో మంచినీటి ప్లాంట్‌ ‌వాడే  మెంట్రన్‌ ‌సిస్టం అధిక పీడనంతో వచ్చే నీటిని కంటికి కనబడని 0.025 మైక్రాన్‌ ‌ఫిల్టర్‌ అతి సూక్ష్మ రంద్రాల ద్వారా వడపోసి మానవ శరీరానికి అవసరమైన మెగ్నీషియం, కాల్షియం, సోడియం, క్లోరైడ్‌, ఐరన్‌ ‌లాంటి లవణాలను బయిటకు పంపేసి  మార్చేసిన లవణ రహితమైన నీటిని మాత్రమే అందిస్తుంది. దీంతో ఎలాంటి లవణాలు లేని మంచినీరు మనిషి శరీరంలోకి వెళ్లిన తర్వాత యాసిడ్‌ ‌గా మారిపోతాయి. దీనివలన రానున్న పదేళ్ల కాలంలో జీర్ణాశయ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, ఊపిరితులపై పెను ప్రభావం పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు ఎదగాల్సిన చిన్న పిల్లలలో కాల్షియం స్థాయి తగ్గిపోయి ఎముకలు బలహీన పడుతున్నాయి. సాధారణ నీటిలో పిహెచ్‌ ‌స్థాయి సుమారు  65 నుంచి 85 వరకు సాధారణ స్థాయిలో ఉండాలి. సాధారణ మిషన్‌ ‌భగీరథ లాంటి నీటిలో డిడిఎన్‌ 150 ‌మినరల్స్ ఉం‌డే ఆర్వో ప్లాంట్‌ ‌నీటిలో కనీసం 60కి మించి ఉండవు. లవణాలు తొలగించిన నీటిని రుచిగా మార్చేందుకు ఎసెన్స్ ‌లాంటి రసాయనలను మిశ్రమం చేసి ప్రజా ఆరోగ్యానికి ముప్పు తీసుకొస్తున్నారు. దీనివల్ల యువకుల్లో మోకాళ్ళ నొప్పులు,  ఎముకల నొప్పుల లాంటి సమస్యలు వెంటాడుతున్నాయి.  ఆర్వో మంచినీటి వాటర్‌ ‌ప్లాంట్‌ ‌ను అధికారులు పర్యవేక్షణ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలి.
image.png
లాకవత్‌ ‌చిరంజీవి నాయక్‌
‌కాకతీయ విశ్వవిద్యాలయం
వరంగల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *