మా బస్తీవాసుల సంపూర్ణ మద్దతు సుధీర్ రెడ్డికే

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : బస్తీలలో మేము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించి, బస్తీలను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తున్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డికే మా సంపూర్ణ మద్దతూ అనీ తెలియచేస్తూ, ఈ ఎన్నికలలో దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి తమ బస్తీల అభివృద్ధిని మరింత మెరుగుపరుచుకుంటామని పలు కాలనీ బస్తీల ప్రజలు తెలియజేశారు. శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎల్.బి.నగర్ బారస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చైతన్యపూరి డివిజన్ పరిధిలోని మున్సిపల్ కాలనీ, ఇంద్రనగర్ కాలనీ, చుట్టుపక్కల కాలనీలలో పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో భాగంగా బస్తీవాసులు సుధీర్ రెడ్డికి అడుగడుగునా మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బస్తీవాసులు మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి ఇండ్ల పట్టాల సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాకు సమస్యను గుర్తించి పట్టాలు ఇప్పించడం జరిగిందని తెలిపారు. మా బస్తీవాసుల సంపూర్ణ మద్దతు సుధీర్ రెడ్డికే ఉంటుంది తెలిపారు. అనంతరం సుధీర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు పరిష్కరించడం జరిగింది అని తెలిపారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కారం చేస్తామని తెలిపారు. ఇప్పుడు నియోజకవర్గం మీద అవగాహన లేని కొత్త, కొత్త నాయకులు వస్తున్నారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. నిజామాబాద్ నుంచి తరిమికొడితే ఇక్కడ వచ్చి పడ్డాడు. నిజామాబాద్ లో చెల్లని రూపాయి హైదరాబాదులో చెల్లుతుందా అని అన్నారు. అంతెందుకు వారి సొంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గొనే ప్రకాష్ రావు వారి పార్టీ నాయకులు అయిన మధుయాష్కీ మీద గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ వీసాలు, నకిలీ డ్యాక్యుమెంట్లు సృష్టించి ఎంతో మందిని మోసం చేశాడని, వారి మీద పోలీస్ స్టేషన్లో 420 కేసులు కూడా నమోదు కావడం జరిగిందని వారే స్వయంగా ఒప్పుకోవడం జరిగిందన్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు యూట్యూబ్ లో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు ఇలాంటి వారు వచ్చి మేము అభివృద్ధి చేస్తామని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బలమైన క్యాడర్ లేకపోయినా అత్యాశతో పోటీ చేస్తున్నాడని తెలిపారు. అలాగే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సామ రంగారెడ్డి సొంత బంధువుల పొలాలు కబ్జా పెట్టడం వల్ల వారి యొక్క బంధువులే వారి మీద దాడి చేయడం నిజం కాదా అని తెలిపారు. ఇంట్లో వారే ఆయనకు ఓట్లు వేయరు. మరి ప్రజల ఓట్లు ఎట్లా వేస్తారని అన్నారు. దొంగలకు, కబ్జాకోరులకు నియోజకవర్గంలో స్థానం లేదని అన్నారు. అనాటి ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి నేడు టిక్కెట్లు అమ్ముకుంటు రేటెంత రెడ్డిగా మారాడని అన్నారు. గత అయిదు సంవత్సరాలుగా తాను చేసిన అభివృద్ధి పనులు నన్ను గెలిపిస్తామని ధీమా వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి మీ యొక్క సహాయసహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలోమాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు తోట మహేష్ యాదవ్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, నర్సిరెడ్డి, పవన్, శరత్ చంద్ర, నరేష్, చిన్నా యాదవ్, శ్రీహరి, నాగలక్ష్మి, జ్యోతి, జయశ్రీ, పావని, సంగీత, అనిత, సుదర్శన్, గట్టు శ్రీను, కిరణ్, కృష్ణ, సంతోష్ యాదవ్, మధు గౌడ్, పలువురు బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *