మా పిల్లలు నిర్దోషులు

  • సికిందరాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌దాడితో సంబంధం లేదని తల్లిదండ్రుల రోదన
  • వారిని వెంటనే విడుదల చేయాలంటూ వినతి
  • ములాఖత్‌లతో కిక్కిరిసిన చంచల్‌గూడ జైలు
  • ఆందోళనకారులను కలుసుకునేందుకు తల్లిందండ్రుల పాట్లు
  • అగ్నిపథ్‌ ఆం‌దోళనలపై కొనసాగుతున్న విచారణ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 20 : ‌సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌పై దాడి కేసులో 46 మంది యువకులు అరెస్టు కావడంతో..వారితో ములాఖత్‌ల కోసం సోమవారం కుటుంబసభ్యులు చంచల్‌గూడ జైలుకు వొచ్చారు. ఇప్పటికే 300 మంది కుటుంబ సభ్యులు ములాఖత్‌ ‌కోసం రిజిస్టర్‌ ‌చేసుకున్నారు. మరోపక్క అల్లర్ల కేసులో అరెస్టైన వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు అల్లర్లతో ఎలాంటి సంబంధం లేదంటున్నారు. వారిని విడుదల చేయాలని విలపించారు. అగ్నిపథ్‌కి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌  ‌రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్ల కేసులో పలువురు యువకులు అరెస్టయ్యారు. వీరంతా చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. యువకులను కలిసేందుకు వారి కుటుంబ సభ్యులు సోమవారం జైలు వద్దకు చేరుకున్నారు.

చంచల్‌గూడకు చేరుకున్న తల్లిదండ్రులతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌విధ్వంసం కేసులో తమ పిల్లలకు ఎలాంటి సంబంధంలేదని చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ పిల్లలను విడుదల చేయాలని విలపించారు. చంచల్‌గూడ జైలుకు వొచ్చిన నిందితుల తల్లిదండ్రులు.. పెద్ద సంఖ్యలో చేరుకుని ములాఖత్‌లో కలుసుకున్నారు. దాడికి ముందు కొందరు ఆందోళనకారులు స్టేషన్‌ ‌బయట బస్సులను ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన ఆందోళనకారులపై పీఎస్‌లో 2 కేసులు నమోదు అయ్యాయి. 143, 341,186, 427, 149 ఐపీసీ పబ్లిక్‌ ‌ప్రాపర్టీ 3 యాక్ట్ ‌కింద రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దాడికి పాల్పడిన ఆందోళనకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ..

సికింద్రాబాద్‌లో చేసిన ఆందోళనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో సాయి డిఫెన్స్ అకాడవి• నిర్వహిస్తున్న సుబ్బారావు నరసరావుపేట పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ విధ్వంసంలో సుబ్బారావు పాత్ర ఉందని భావించిన పోలీసులు.. అతడిని అరెస్ట్ ‌చేసి మూడు రోజుల నుంచి పలు కోణాల్లో గోప్యంగా విచారిస్తున్నారు. సుబ్బారావుపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఆయన అల్లర్లకు ప్రేరేపించినట్లు ఇంకా ఆధారాలు లేవన్నారు. మరింత సమాచారం కోసం టెక్నికల్‌ ‌డిపార్టుమెంట్‌లోని నిపుణులను సంప్రదించినట్లు పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా నరసరావుపేట రైల్వేస్టేషన్‌ ‌వద్ద భద్రత పెంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *