ఆమనగల్లు, ప్రజాతంత్ర జూలై 25 : మండలంలోని మేడిగడ్డ తండాలో శీతల పండుగ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తాండ సమీపంలో పూజలు నిర్వహించారు. మా మూగ జీవాలను ముత్యాలమ్మ తల్లి చల్లంగా చూడాలని వేడుకున్నారు. అనంతరం అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమర్ సింగ్, ఉపసర్పంచ్ మల్లేష్, గ్రామ పెద్దలు రవీందర్ నాయక్, శంకర్ నాయక్, డీలర్ కృష్ణ నాయక్, లక్ష్మణ్ నాయక్, రఘునాయక్, తదితరులు పాల్గొన్నారు.




