మా ఎమ్మెల్యేలను టచ్‌ చేస్తే అంతే సంగతులు

48 గంటల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలుతుంది
మంత్రి మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై
బీజేపీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి హెచ్చరిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి30: బిజెపి ఎమ్మెల్యేలను ముట్టుకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వా న్నే కూల్చేస్తామని తెలంగాణ మంత్రి కోమట ిరెడ్డి వెంకట్‌ రెడ్డికి బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. మంత్రి  వ్యాఖ్యలపై మహేశ్వర రెడ్డి స్పందిం చారు. ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను టచ్‌ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 48 గంటల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. బీజేపీ హైకమాండ్‌తో తెలంగాణ మంత్రులు టచ్‌లో ఉన్నారని మహే శ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సహా ఐదుగురు మంత్రులు సంప్రదింపులు జరిపారని వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో సీఎం రేవంత్‌ రెడ్డికి నిద్ర కూడా పట్టడం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారనే మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను మహేశ్వర రెడ్డి ఖండిరచారు.

కోమటిరెడ్డి తమ్ముడు రాజగోపాల్‌ రెడ్డి టచ్‌లో ఉన్నాడో లేడో తెలుసుకోవాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ చేత ఎందుకు విచారించడం లేదని మహేశ్వర రెడ్డి నిలదీశారు. రంజిత్‌ రెడ్డి భూములపై ఆరోపణలు చేశారు.. తర్వాత పార్టీలో చేర్చుకుని పక్కన కూర్చొబెట్టుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. టెలిఫోన్‌ యాక్ట్‌ కేంద్ర ప్రభుత్వానిది అయినందున ఆ కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే స్థాయి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి లేదని మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు.

భువనగిరి ఎంపీ సీటును వెంకట్‌ రెడ్డి గెలిపించుకోవాలని సవాల్‌ విసిరారు. చేరికలకు సంబంధించి బీజేపీ గేట్లు తీస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం 48 గంటలు కూడా ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఏక్‌నాథ్‌ షిండే పాత్ర పోషించడానికి చాలా మంది నేతలు ఉన్నారని హాట్‌ కామెంట్స్‌ చేశారు. రాజీనామా చేసిన తర్వాత ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరారని మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఆర్‌ టాక్స్‌ వసూల్‌ చేస్తున్నారని మహేశ్వర రెడ్డి ఆరోపించారు. ఆర్‌ అంటే రేవంత్‌, రాహుల్‌, రాజీవ్‌.. ఇందులో ఏ పేరుతో ట్యాక్స్‌ వసూల్‌ చేస్తున్నారో మాత్రం తెలియదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రూ.1500 కోట్లు హైకమాండ్‌కు పంపించారని వివరించారు. మరో రూ.500 కోట్లు పంపించాల్సి ఉందని గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *