మావోయిస్టుల మృతదేహాలు లభ్యం

  • మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు
  • కంప్యూటర్‌లు, ప్రింటర్‌, నిత్యవసర వస్తువులు స్వాధీనం

భద్రాచలం, ప్రజాతంత్ర, మే 01 : సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ జిల్లా అబుజ్‌మడ్‌ అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టులలో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మంగళవారం రాత్రి వరకు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా మృతి చెందిన 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల చిత్రాలను పోలీసులు బుధవారం విడుదల చేసారు. అయితే మృతి చెందిన మావోయిస్టులను ఇంకా గుర్తించాల్సి ఉందని ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్ర పోలీసులు తెలిపారు.

కాగా మృతి చెందిన మావోయిస్టులలో కేంద్ర కమిటి, రాష్ట్ర కమిటి సభ్యులు ఉన్నట్లు భావిస్తున్నారు. దండకారణ్యంలో మావోయిస్టులు భారీ స్న్యంలో సంచరిస్తున్నారని డిఆర్‌జి, ఎస్‌టిఎఫ్‌ బలగాలు దండకారణ్యంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో మావోయస్టులకు భారీగా ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టుల రహస్య స్థావరాలను భద్రతా బలగాలు కనుగొన్నాయి. వారి వద్ద నుండి కంప్యూటర్‌ మరియు ప్రింటర్‌ నిత్యావసర వస్తువులు కనుగొన్నారు. వీటిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు అటవీ ప్రాంతంలో గుడారాలు వేసుకుని ఉంటున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు పక్కా సమాచారంతో కూంబింగ్‌ చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *