- కట్టడి చేసేందుకు పోలీసుల వ్యూహరచన
- భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో అంతర్ రాష్ట్ర సరిహద్దు అధికారుల సమావేశం
భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 05 : మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని వెంటనే పరస్పర సమన్వయంతో అధికారులు తీసుకునే చర్యల ద్వారా మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరం అవుతుందని భద్రాచలం ఏఎస్పి పారితోష్ పంకజ్ తెలిపారు. జిల్లా ఎస్పీ డా.వినీత్జీ సూచనల మేరకు మంగళవారం భద్రాచలం ఏఎస్పి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో తెలంగాణ, ఆంధప్రదేశ్, చత్తీస్ఘఢ్• రాష్ట్రాల పోలీసు అధికారులు మరియు మూడు రాష్ట్రాల సిఆర్పిఎఫ్ అధికారులతో అంతర్ రాష్ట్ర సరిహద్దు సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో పలువురు పోలీసు అధికారులు మాట్లాడుతూ…రానున్న సార్వత్రిక ఎన్నికలలో తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించామని తెలిపారు. ఈ సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్, మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు, ఛత్తీస్ఘఢ్ డిఎస్పీలు శంకర్రావు, శేఖర్ మడవి సిఆర్పిఎఫ్ కమాండెంట్ అయోధ్య సిన్హా, ప్రీతి, అజయ్ ప్రతాప్ సింగ్, పీయూష్ తివారిలు, పామేడు సిఐ ప్రదీప్, మారాయి గూడెం సీఐ రాజేంద్ర దివాన్, ఊసూర్ సిఐ వినోద్ ఎక్క, ఎలిమిడి సీఐ ప్రధాన్, ఎటపాక సిఐ గజేంద్ర కుమార్, ఎస్సై పార్థసారథి, భద్రాచలం సబ్ డివిజన్ పోలీస్ సిఐలు రాజగోపాల్, రమేష్, నాగరాజు రెడ్డి, ఎస్సైలు మధు ప్రసాద్, కేశవరావు, గణేష్, పివిఎన్ రావు, విజయలక్ష్మిలు పాల్గొన్నారు.




