తనకెన్ని సమస్యలెదురైన
బెదరక అడుగేసేటోడే నేటిమనిషి
తన ఉనికికే ఎసరొచ్చినా
ఏంమాట్లాడని మౌనముని
బతుకెంత భారమైన బాధపడతాడే తప్ప
కారణాలెతకడు
ఎందుకంటే
ప్రతిదానికి కారణమతడేగనుక

చెమటను చిందిస్తూ చింతలేక బతికిన దినాలెన్నో
రేపటికై చింతలేనోడొకపుడు
తెలిసిన తెలియకున్నా
చేసే పనిలో న్యాయముండేది
నాయకుడైనా అనాముకుడైన
జీవనగమనంలో సంతోషం వెతుకునేటోళ్ళు
లోకంలోకొచ్చింది ఇచ్చిపోవడానికని తోచినంతలో మంచికై ముందడుగేసేవాళ్ళు ముందుండేవాళ్ళు
పరులకోసం పాటుపడాలనే
తోవలో అడుగేసేటోళ్ళే

కాలఛక్రం గిర్రునదిరిగి
గిప్పడేమో బగ్గమంటది
స్వార్థన్నలంకరించుకున్న మానవుడే నేడెక్కడైనా
తానెదిగేందుకు ఎంతకైనా తెగించే మనసున్నోడు
ప్రకృతినంతా పాడుచేసి
కలుషితమైండు
కాలుష్యమంతా పుడుమికద్దిన బద్దిమంతుడు
మంచినీళ్ళనుసైతం వ్యాపారంగా మార్చిన మహానియుడు

అభివృద్ధి ముసుగులో పుడమికడుపును చీల్చుకుంటూ దోపిడీకి దారులేస్తున్న దొరబాబులు
ఎటుచూసినా భూబకాసురులే
కృత్రిమ సంతోషలే

ప్రతోడిచేతిలో
అణ్వాయుధాలే నొక్కితేచాలు
మిగలడొక్కడైనా
చెమటపట్టనోడు చెమటకు విలువకడుతున్నడిపుడు
ఆకలికి మాత్రం అడ్డుకట్టలే లేవాయే
అణువణువునా అహాన్ని అలంకరించనున్న రోజులివి
మానవత్వం మంచితనం
అణువంతైనా కనపడదు
అధికారమొక్కసారొస్తేచాలు
వదులుకోలేక
ఉచితపథకాలకు బానిసలుగా
మార్చి ఏమారుస్తున్నారు
వరాలైతే వరదలై పారుతుంటయ్‌
అభివృద్దంతా మాటల్లోనే
విశ్వమంతా ఇదే తంతు
వీరిని మోయడం పేదోడి వంతు
ఇది మారని చరితకు తార్కాణం

– సి. శేఖర్‌(‌సియస్సార్‌),
‌పాలమురు,
9010480557.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *