ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ తయారీలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్కు చెందిన రఘువంశీ గ్రూప్ తయారీ, సరఫరా చైన్ కోసం స్వయం ప్రతిపత్తి కలిగిన పరిష్కారాల్లో ముందంజలో ఉన్న పార్ ఈస్ట్ సంస్థతో చేతులు కలిపింది. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సమక్షంలో సాయుధ దళాల కోసం మానవరహిత గైడెడ్ వెహికిల్(యూజీవీ)ను అరోబోట్ ప్రారంభించింది. అరోబోట్ అనే ఈ స్టార్టప్ సంస్థ.. సాయుధ దళాల కోసం మానవరహిత గైడెడ్ వెహికిల్(యూజీవీ) రూపొందించిందని అరోబోట్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రవి ఆచంట చెప్పారు. యూజీవీ ఆవిష్కరణ సందర్భంగా రఘువంశీ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ వంశీ వికాస్ మాట్లాడుతూ రఘువంశీ గ్రూపులో మా విలువైన వినియోగదారులకు వినూత్న సాంకేతిక పరిష్కారాలను అందించడానికి మాకు ఎనలేని నిబద్ధత ఉందన్నారు.



