‘‘మనగురించి మనం ఆలలోచించు కోవడం మరిచిపోతే ప్రపంచమూ ప్రపం చమూ మనల్ని మరిచి పోతుందని చరిత్రలో చాలాసార్లు రు జువైంది’’ అన్నది స్త్రీల గురించి జర్మన్ రచయిత్రి లూయిస్ ఓటోపీటర్స్.నూటా పదమూడు సంవత్సరాల క్రితం మహిళల పట్ల సమాజ దృక్పథం వేరుగా ఉండేది. అసమానత, అణచివేతలు భరిచలేని స్థాయికి చేరడంతో మహిళలు తమ గోంతులు విప్పక తప్పని పరిస్థితి నెలకొంది. తమ పరిస్థితుల్లో మార్పును కోరుతూ మహిళలు రోడ్డెక్కిన తొలి ఘటన 1908 సంవత్సరంలో జరిగింది. 15వేల మంది మహిళలు సరైన వేతనం, తక్కువ పనిగంటలు, ఓటు హక్కు కోరుతూ న్యూయార్క్లో ప్రదర్శన నిర్వహించారు. అమెరికన్ సోషలిస్టుపార్టీ 1909 ఫిబ్రవరి 28ని జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. 1910 ఆగస్టులో డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగెన్లో అంతర్జాతీయ మహిళా సదస్సు జరిగింది.
ఆమెరికా సామ్రాజ్యవాదులచే ఉత్తేజితులైన జర్మన్ సామ్రాజ్యవాది లూయిస్ జియట్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించగా జర్మనీకి చెందిన మరొక ఉద్యమకారిణి క్లారాజెట్కిన్ దానిని సమర్థించారు. 17 దేశాలనుంచి వచ్చిన వంద మంది మహిళలు ఓటుహక్కుతోపాటు సమాన హక్కులు సాధించడానికి ఇది సరైన వ్యూహమని అంగీకరించారు. ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో ఏదో ఒక రోజును మహిళా దినోత్సవంగా జరుపుకోవడం అన్ని దేశాలు ప్రారంభించాయి. అయితే 1908లో జరిగిన మొదటి ప్రదర్శన మహిళా ఉద్యమాలకు స్ఫూర్తికావాలన్న ఉద్దేశ్యంతో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినో త్సవంగా ఆచరణలోకి వచ్చింది. 1975, 1977ల్లో యుఎన్ జనరల్ అసెంబ్లీ మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ఆర్థిక, రాజకీయ, సామాజిక పరంగా – ఇంకా అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతోపాటు వారి హక్కుల గురించి అవగాహన కల్పించడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉద్దేశ్యం.
నూటా పదేళ్ళకు పైగా ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధించిన విజయాలు అపారం. స్వేచ్ఛాగీతం పాడుతూ స్వావలంబన సాధిం చడానికి మహిళలు నిత్య సమరం సాగిస్తున్నారు. అయితే భారత సమాజంలో తొంభై శాతం స్త్రీలు తమ బతుకులు వెళ్ళదీయడానికే పోరాటం చేయ్యాల్సి వస్తుంటే ఇక తమ అస్తిత్వాన్ని చాటు కునేదెప్పుడు అన్నది ఇప్పటికీ ప్రశ్నే. ఎందుకంటే ఇప్పటిదాకా చరిత్రను పరిశీలిస్తే విజయం సాధించిన మహిళలకంటే సమరం సాగిస్తున్న వాళ్ళే ఎక్కువ అన్నదే రుజువవుతున్న పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి ప్రపంచ జనాభాలో సగానికి పైగా మహిళలున్నారు. ప్రపంచంలో జరిగే పని లో మూడింట రెండు వంతుల పనులను స్త్రీలే చేస్తున్నారు. అయినప్పటికీ మగవాళ్ళతో సమ ంగ వ్యవహరించగల అధికారం వాళ్ళకు దక్కడం లేదు. స్వేచ్ఛగా, గౌరవపదంగా జీవించడానికి అవకాశాలులేవు. మానవ హక్కులను అను భవించే సరిస్థితులులేవు. అణచివేతనుండి వి ముక్తి, స్వతంత్య్ర వ్యక్తిత్వం ఏ సమాజ మహిళకైనా ప్రాణావసరాలు. అత్యంత లింగ వివక్షత ఉన్న మొదటి పది ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటి అని ప్రపంచ ఆర్థిక సంఘం గుణాంకాలు తెలియజేస్తున్నాయి.
కుటుంబ యాజమాన్యం, ఆస్తిపై, పిల్లలపై హక్కులు పురుషుడివికాగా కుటుంబ నిర్వహణ బాధ్యత మాత్రం మహిళలది అన్న స్థితి నేటికీ కొనసా గుతున్నది. స్త్రీలు విద్య, ఉద్యోగ ఉపాధి రంగాల్లో ప్రవేశించినప్పటికీ కుటుంబ పరిధికి భిన్నంగా వారిని పరిగణించలేకపోవడంవల్ల వనరులపైన గాని, ఆదాయాలపైన గాని వాళ్ళకు అధికారం, నియంత్రణ లేదనేది వాస్తవం.స్వతంత్య్ర వక్తిత్వం కలిగిన మనుషులుగా మగవాళ్ళతో సమాన గౌరవంగల వ్యక్తులుగా ఎదిగే క్రమంలో ఆడ వాళ్ళకు ఎదురవుతున్న సవాళ్ళు అనేకం. వివక్ష అసమానతలు వెనక్కి లాగుతున్నా పట్టుదలగా ముందుకు వెళ్ళే ప్రయత్నంలో సఫలీకృ తులవుతున్నారు నేటి మహిళలు. స్త్రీలు ప్రధాన మంత్రులవుతున్నారు. దేశాధ్యక్షులవుతున్నారు. అంతరిక్ష యాత్రలు చేస్తున్నారు. అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. బడిలో చేరిన బాలికను విశ్వ విద్యాలయందాకా తీసుకొనిరావడానికి ప్రయ త్నాలు జరుగుతున్నాయి. ఎంచుకోవడానికి అమె ముందు ఇప్పుడు అవకాశాలున్నాయి.
వాటిని అందిపుచ్చుకునే శక్తి సామర్థ్యాలున్నాయి. అయితే సామాజిక భద్రత మాత్రం పూర్తిగా కొరవ డుతున్నది. కులం, వర్గం, మతం, ప్రాంతం, వయస్సు, వరుసతో సంబంధంలేకుండా విచక్షణా రహితంగా విత్యం బాలికలు, మహిళలపై జసరుగుతున్న శారీరక, మానసిక హింసయే అందుకు నిదర్శనం. అత్యాచారాలు, అపహరణలు, వరకట్నంతోపాటు వివిధ రకాల వేధింపులు, ప్రేమోన్మాద చర్యలు, భ్రూణహత్యలు, ఆడపిల్లల అక్రమరవాణా, అమ్మకాలు రోజువారీ సమస్యలుగా మారాయి. ఇటీవల దేశంలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు చూస్తుంటే, వింటుంటే నిజంగా మనం ఎటువైపు పోతున్నాం? శాస్త్ర సాంకేతిక రంగాలతోసహా అన్నింటా ప్రగతిని సాధిస్తున్నామనకుంటున్న మనం మహిళల పట్ల మన ఆలోచనా దృక్పధాన్ని ఎందుకు మార్చుకోలేక పోతున్నాం అన్నది ప్రస్తుత సమాజం తీవ్రంగా ఆలోచించాల్సిన విష యం.
అధిక జనాభా ఉన్న దేశాల్లో స్త్రీలు తమ ఆరోగ్యపరమైన జీవితకాలంలో అయిదు శాతాన్ని అత్యాచారాలవంటి హింసను అనుభవించడంవల్ల కోల్పోతున్నట్లు ప్రపంచ బ్యాంకు అంచనాలు తెలయిజేస్తున్నాయి. ఇంటాబయట పితృస్వాయ్య అధికారపు ఒత్తిడుల మధ్య జీవించే మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో తమ శక్తినంతా కూడదీసుకొని పనిచేయాల్సి వస్తుంది. ఈ రకమైన వత్తిడి, అలసటవల్ల వాళ్ళు వివిధ డకాల శారీరక, మానసిక రుగ్మతలకు లోన వడం ఫలితంగా అభివృద్ధి కృషిలో తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించలేని సరిస్థి తులు ఏర్పడే అవకాశముంది. ఇది ఒక సాకుగా మహిళల క్రియాశీలక పాత్రను హేళన చేస్తూ ఈ పనులు మహిళలు చేయలేరు అనిపించే భావనను కలిగిస్తుంది. ఈ భావన వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఈ ప్రభావం మహిళల శ్రమ శక్తితో నిండిన కుటుంబాలపై తద్వారా సమాజంపై పడుతుంది. దీనివల్ల నైతిక విలువలు పతనమయ్యే ప్రమా దముంది. ఫలితంగా సమాజమంతా ఆనారోగ్య కరంగా మారి భావితరాలవారికి ఆయోమయాన్ని సృష్టిస్తుంది. వీటికతోడు ఎలక్ట్రానిక్ మీడియా , సీనిమాలు, సీరియళ్ళు, వ్యాపార ప్రకటనలు స్త్రీ పాత్రల చిత్రీకరణలో అనుసరించే ధోరణులు కూడా మానవ సంబంధాలను పెడదారి పట్టించ•డాన్ని కూడా గమనించాల్సిన విషయం.
వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మనం మహిళా సాధికారతగురించి మాట్లాడుకోవాల్సిన అవస రముంది. మహిళా సాధికారత అంటే సమాజంలో మహిళలకు సమాన స్థానం కల్పించడానికి విధా నాల్లో మార్పు తేవడంతోపాటు సమాజవైఖరిలోనూ మార్పురావడం మానవాభివృద్ధి నివేదిక ప్రకారం మహిళా సాధికారత అంటే ‘మహిళలు కుటుం బంలో, సమాజంలో ఆర్థిక, రాజకీయ రంగాల్లో చురుకైన నిర్ణాయకపాత్రను నిర్వహించడం•, దీనివల్ల కేవలం మహిళలు అభివృద్ధి చెందడమేకాదు, సుస్థిరమైన వృ•ద్ధి సాధన, సమాజ పురోగతి పాధ్యమవుతుంది.
భారత రాజ్యాంగం అన్నిరకాల వివక్షతను రద్దుచేస్తూ సమానత్వ హామీ ఇచ్చినా అది ఆచరణలో మాత్రం కనిపించడంలేదు. మహిళా షాధికారత భావన ప్రచారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ పరిస్థితి యధాతథంగా కొనసాగడం, ఈ పరిస్థితుల్లో అన్నిరంగాల్లో స్త్రీ పురుష సమానత్వం సాధించ డమనేది యావత్ సమాజానికి ఒక సవాల్. ఇంకో ఆసక్తికర అంశంఏంటంటే ‘ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచే పనులన్నీ మహిళలు చేస్తారు. పురుషులేమో వాళ్ళకు ముందువరుసలో నిలబడి అంతా తామే చేసినట్లు చెప్పుకుంటారు అంటూ మొదలు వుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక.
మహిళా సాధికారత, స్త్రీ పురుష సమానత్వం, సుస్థితరమైన భవిత, రేపటి మహిళలు (ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి ఇచ్చిన థీమ్) గురించి మాట్లాడుకుంటున్న ప్రస్తుత సందర్భంలో ముందుగా మహిళలను అత్యంత విలువైన మానవ వనరుల సంపదగా పరిగణించాల్సిన అవస రముంది. కేవలం స్థానిక సంస్థల్లో భాగ స్వామ్యం మాత్రమే పరిపోదు. శాసన నిర్మాణం జరిగే చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి. మనం ఎక్కడనున్నాం అని ప్రశ్నించు కుంటూనే ‘మహిళా హక్కులన్నీ మానవ హక్కులే’ అని గుర్తించాలి. సమానావకాశాలు పొందడం మహిళల హక్కు అని అందరూ భావిస్తే సమాజంలో అన్ని రకాల హింసా తగ్గుతుంది. శాంతి పెరుగుతుంది. ప్రపంచమంతా ఆరోగ్య ంగా, ఆనందంగా ఉంటుంది. స్త్రీలను చూసే దృష్టిలో మార్పుకోసం స్త్రీలేకాదు సమాజా భివృద్ధిని కాంక్షించే ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి.
మహి ళలు సమస్యలనధిగమించడానికి ధైర్యంతె చ్చుకోవాలి. స్ఫూర్తిని పొందాలి. అవసరమైన సందర్భాల్లో పరిస్థితులను ఎదిరించాలి, ప్రశ్నించాలి, నిరసించాలి. సమానత్వ సాధనలో సంస్థలూ, ప్రభుత్వాల పాత్రేకాదు. పౌరులుగా మన బాధ్యతా విస్మరించరానిదే. ఆ మార్పుకు కుటుంబమే పునాది కావాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు బాల బాలికలను సమంగా చూడాలి. ఎదగడానికి ఆమ్మాయిలకూ అవకా వాలివ్వాలి. మనిషిని మనిషిగా గౌరవించగల సంస్కారాన్ని ప్రతీ వ్యక్తీ అలవర్చుకోవాలి. సామాజిక మార్పు కావాలన్న తపనతో మానవీ యకోణాన్ని ఆవిష్కరించుకోవడం మనందరి సామాజిక బాధ్యత. ఆ వైపు పయనిస్తూ సమస్యల్లేని సమాజాన్ని నిర్మించుకుందాం.
డాక్టర్ కొమర్రాజు రామలక్ష్మి, 9849234725




