మాదిగలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలి

ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు బిఎన్.రమేష్ కుమార్ మాదిగ
హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : రాష్ట్రంలో 60 లక్షల జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి జనాభా దామాష ప్రకారం మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించి న్యాయం చేయాలని మాదిగ రాజకీయ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బిఎన్.రమేష్ కుమార్ మాదిగ కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మాదిగల ఓట్లు కీలక పాత్ర వహించాయన్నారు. కావున తెలంగాణ రాష్ట్ర పాలనలో మాదిగ సామాజిక వర్గానికి వచ్చే కేబినెట్ సమావేశంలో మరో రెండు మంత్రి పదవులు కేటాయించాలని కోరారు. మొదటి నుంచి కాంగ్రెస్ కు స్థిరమైన మద్దతు దారులుగా మాదిగలు ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో ఎం.ఇందిర, లాజర్, కిషోర్, వెంకటస్వామి, చిరంజీవి, విల్సన్, రవి, నాగరాజు, రమణ, సంపత్, ఎల్లయ్య, సాయన్న, నాగభూషణం, కుషాల్, కుమార్, రమేష్, శ్రీనివాస్, గట్టమ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *