మాదాపూర్ లో గీతం సిటీ ఆఫీసు ప్రారంభం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 7: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హె  హైదరాబాద్ సిటీ కార్యాలయాన్ని గురువారం మాదాపూర్, సిలికాన్ వ్యాలీ, జెహింద్ గాంధీ రోడ్డులోని టీపీ హౌస్ లో అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు లాంచనంగా ప్రారంభించారు. ఏటికేడాది పలు వినూత్న కోర్సులను ప్రారంభిస్తున్న గీతం  ఆయా సమాచారం జంట నగర వాసులకు సులువుగా అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని మాదాపూర్ లో ప్రారంభించినట్టు ప్రోవీసీ చెప్పారు. గీతం ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియ మరింత చేరువగా, పారదర్శకంగా, కేంద్రీకృతంగా, సులువుగా అందుబాటులో ఉండేలా ఈ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా అత్యుత్తను విద్యను బోధిస్తూ గీతం దినదినాభివృద్ధి చెందుతోందని ప్రొఫెసర్ డీ.ఎస్.రావు వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఉపకరించే ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలు, నిబద్ధతతో కూడిన తగిన విద్యార్హత గల అధ్యాపకులు, అత్యుత్తమ బోధన-శిక్షణలను గీతం అందిస్తోందని చెప్పారు.హైదరాబాద్ అడ్మిషన్ల అధిపతి డాక్టర్ కె.శివకుమార్, హెచ్ఎర్ డిప్యూటీ డెరైక్టర్ శిరీషా జెట్టి తదితరుల సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *