మాతా శిశుసంరక్షణలో భేష్‌

తెలంగాణ ప్రభుత్వంపై యూనిసెఫ్‌ ‌ప్రశంసలు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : ‌తెలంగాణ ప్రభుత్వంపై యునిసెఫ్‌ ఇం‌డియా ప్రశంసలు కురిపించింది. మాతా శిశువుల సంరక్షణ కోసం రాష్ట్ర సర్కార్‌ ‌చేస్తున్న కృషి అద్భుతమని కొనియాడింది. సురక్షిత డెలివరీల కోసం సిబ్బందికి మిడ్‌ ‌వైఫరీ కోర్సులో శిక్షణ ఇస్తున్న తీరును యునిసెఫ్‌ ఇం‌డియా మెచ్చుకున్నది.

ఈ నేపథ్యంలో యునిసెఫ్‌ ఇం‌డియా తన ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది. హైదరాబాద్‌లోని ఓ ఏరియా హాస్పిటల్‌లో మిడ్‌ ‌వైవ్స్ ‌ద్వారా పురుడు పోసుకున్న ఓ శిశువు ఫోటోను యునిసెఫ్‌ ఇం‌డియా తన పోస్టులో జత చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *