మాడుగులలో బిజెపిలో భారీగా చేరికలు 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 25 : త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని బిజెపి అభ్యర్థి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. బుధవారం మాడుగుల మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు భారీగా బిజెపిలో చేరారు. వారిని ఆచారి బిజెపి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. కోర్రతాండ, కట్రవత్ తాండ గ్రామపంచాయతీ చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి  సమక్షంలో  బీజేపీ పార్టీలో చేరారు. అదేవిధంగా మాడుగుల మండలం దొడ్లపాడు, నల్లవారిపల్లి, చంద్రయన్ పల్లి, కలకొండ గ్రామపంచాయతీలో ఎన్నికల ప్రచారంలోనే భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *