మాట్లాడితే మతోన్మాదులమా.. కొమ్ముగాస్తే సెక్యులర్‌ వాదులా..

రాష్ట్రంలో కొనసాగుతున్నది రాచరికమా.. రజాకార్ల పాలననా..
 చెంగిచర్ల బాధితుల పరామర్శలో నిప్పులు చెరిగిన
 బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌

మేడిపల్లి, ప్రజాతంత్ర, మార్చి 27 : రాష్ట్రంలో కొనసాగుతున్నది రాచరికమా.. రజాకార్ల పాలననా అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అని ప్రశ్నించారు. ఓ వర్గానికి కొమ్ముగాస్తే సెక్యులర్‌ వాదులు.. ప్రశ్నిస్తే మతోన్మాదు లా అంటూ ప్రశ్నించారు. చెంగిచర్ల ఘటన లో గాయపడిన బాధితులు పలువురిని బుధవారం పరామర్శించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ బలుపు, కండకావరంతో మహిళలనే విచక్షణ లేకుండా రోహింగ్య, మాఫియా మూకలు దాడులకు తెగబడ్డాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారీ కూలీలలపై ఓ వర్గం దాడులకు పాల్పడితే ప్రభుత్వం ఇంత వరకు స్పందించకపోవడం, నిందితులపై ఇంత వరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించ కపోవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు బాధితులపై అక్రమం గా బనాయించిన నాన్‌ బెయిలబుల్‌ కేసులు ప్రభుత్వం బేషరతుగా ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని, అన్ని విధాలుగా వారికి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. బాధిత మహిళలపై దాడికి పాల్పడి, అక్రమ కేసులు బనాయించి నిందితులకు వంతపాడుతున్న మేడిపల్లి సీఐ, ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిస్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎవరు తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

చట్టం అందరికీ సమానమని, కానీ చట్టం కొందరికి చుట్టమనే రీతిలో వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. శాంతిభద్రతల సమస్య వస్తుందని  సెక్యులర్‌ ముసుగులో వ్యవస్థలు ఉదాసీనంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో పరిస్ధితులు మరింత దిగజారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. హిందువులపై దాడులు జరుగుతున్నా బాధితులపైనే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టి వేదింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. హిందూ పేదలపై దాడులు జరిగితే ఇంతవరకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, కమ్యూనిస్టులు ఎవ్వరైనా పరామర్శించారా.. అని ప్రశ్నించారు. ఈ పార్టీలనీ ముస్లీంలకే కొమ్ముకాసే  స్పష్టం చేశారు. మైనారిటీ డిక్లరేషన్‌ పేరుతో బాహాటంగా ముస్లీంలకు కొమ్ముగాస్తామని ప్రకటించినా తెలంగాణ హిందూ సమాజం ఆలోచించక అధికారం కట్టబెట్టడం పెద్ద పొరపాటని సంజయ్‌ వ్యాఖ్యానించారు.

అప్పట్లో రజాకార్లు నగ్నంగా బతుకమ్మ లాడిరచిన సంఘటనలు చూడలేదు ప్రత్యక్షంగా చూడలేదు గానీ.. జై శ్రీరామ్‌ అనుకుంటూ భక్తియుత వాతావరణంలో పండుగ చేసుకుంటుంటే నయా రజాకార్లు దాడులు చేసిన సంఘటనను తెలంగాణ సమాజానికి కాంగ్రెస్‌ పార్టీ కళ్ళకు కట్టినట్లు చూపించిందని.. వారిపై చర్యలు తీసుకోకపోవడం దీనికి బలాన్నిస్తోందని.. ఇదే వారి మార్క్‌ సెక్యులరిజమని ఆయన ధ్వజమెత్తారు. హిందూ సమాజం బలోపేతం, సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమయ్యిందని అన్నారు. హిందువులకు అండగా బీజేపీ ఎప్పుడు ఉంటుందని అభయమిచ్చారు. కాగా ఘటనా స్థలికి ఎవ్వరినీ రానివ్వకుండా పోలీసులు భారీగా మోహరించి అడుగడుగునా బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. అయితే బండి సంజయ్‌ పర్యటన నేపథ్యంలో వేలాదిగా అక్కడికి చేరుకున్న బీజేపీతో పాటు పలు హిందూ సంఘాలకు చెందిన నాయకులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయడంతో వారి మద్య వాగ్వాదం చెలరేగింది. నాయకులను నిలువరించే యత్నంలో కొందరికి గాయాలు కావడం గమనార్హం.

 పోలీసుల తీరుపై బండి ఫైర్‌…
బాధితులపైనే హత్యా యత్నం కేసులు బనాయించిన పోలీసులు.. నిందితులైన మాఫియా ముఠాల అడుగులకు మడుగులొత్తుతున్నారని బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు. చెంగిచర్ల పిట్టల బస్తీలో నివాసితులు వారి ఆచారం ప్రకారం హోలీ కామదహనం వేడుకలు జరుపుకుకుంటుంటే ఎక్కడి నుంచో వచ్చిన మతోన్మాద ముఠాలు అడ్డుపడి రాళ్ళతో దాడి చేస్తూ మహిళలను గుంజుకుపోయి, గర్భిణీలు, బాలింతలు, రోగపీడితులు, చిన్నారులు అనే కనికరం లేకుండా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా తన్నడం, కొట్టడం, ఇండ్లపై దాడికి పాల్పడడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.

న్యాయం చేయమని పోలీసుల దగ్గరకు బాధితులు వెళితే.. ముఠాలు వారి ముందే పోలీస్‌స్టేషన్‌లోనే మహిళలను తన్నడం, దాడి చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రక్షకులే భక్షకులైనట్లు పోలీసులు బాధితులపై లాఠీలు ప్రయోగించడమే గాకుండా వారిపైనే హత్యాయత్నం కేసులు మోపడం, దాడికి ప్పాడ్డ నిందితులకు రాచమర్యాదలు చేయడం ఏమిటని మండిపడ్డారు. పోలీసులు ముడుపులు తీసుకుని నిందితులపై బెయిలబుల్‌ కేసులు పెట్టి, బాదితులను బాదపెట్టడం రాచరికమా.. రాజకార్ల పాలనననా అని నిలదీశారు. నిజానిజాలు పరిశీలించకుండా మరణాయులతో వచ్చి దాడి చేసినోళ్లను వదిలి బాధిత మహిళలపై చేయిచేసుకున్న మేడిపల్లి సీఐ గోవింద్‌ రెడ్డి, ఎస్‌ఐ అనిల్‌కుమార్‌లను ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టమని సంజయ్‌ హెచ్చరించారు. ఈ పర్యటనలో బండి సంజయ్‌ వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *