ఉప్పల్ , ప్రజాతంత్ర, డిసెంబర్ 11: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, బిఆర్ఎస్ గ్రేటర్ నాయకులు సాయి జన శేఖర్, నేమూరి మహేష్ గౌడ్ లు పరామర్శించారు. సోమవారం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వారు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ ని అడిగితెలుసుకున్నారు.కాగా గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో కేసీఆర్ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు.
మాజీ సిఎం కేసీఆర్‌ను పరామర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అనుచరులు



