ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 24: రాష్ట్ర అభివృద్ధిలో తన మార్క్ చూపిస్తూ దేశం హర్షించే నేతగా జననీరాజనాలు అందుకుంటున్న బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కి నగర మాజీ మేయర్ బొంతు రాంమోహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ చౌరస్తా లో మాజీ మేయర్ బొంతు రాంమోహన్ అద్వర్యం లో మంత్రి కేటీ రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం భారీ కేక్ ను కట్ చేసి బి ఆర్ ఎస్ నాయకులు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు కేకు , మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రిగా రాష్ట్ర అభివృద్ధిలో తన మార్క్ చూపిస్తూ అలాగే దేశం హర్షించే నేతగా జననీరాజనలు అందుకుంటున్న బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు బొంతు శ్రీదేవి యాదవ్ , స్వర్ణరాజ్, బన్నాల గీతా ప్రవీణ్,మాజీ కార్పొరేటర్ లు గంథం జోత్స్నా నాగేశ్వరావు,గోల్లూరి అంజయ్య,హన్మంత్ రెడ్డి, సదానంద్, బీఆర్ఎస్ నాయకులు,మధుసూదన్ రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి ,శ్రీకాంత్ గౌడ్,తూట్ నరసింహ,ఆలే రమేష్,శంకర్ అన్న,మధు ముత్యాల,రఘు గౌడ్ ,శ్రీనివాస్ రెడ్డి,స్వామి,రవి,నందు, మల్లేష్ ,అద్విత్ తదితరులు పాల్గొన్నారు,




