మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు

కుల్కచర్ల, ప్రజాతంత్ర డిసెంబర్,25: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలో సోమవారం నాడు భారత రత్న అవార్డు గ్రహీత, దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారి వాజ్పేయి జయంతి కార్యక్రమం బీజేపీ కులకచర్ల  మండల అధ్యక్షుడు గాదె మహిపాల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాద్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఘనపురం వెంకటయ్య గౌడ్ హాజరై మాట్లాడారు..దేశానికి సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపించిన ప్రధాని అవసరం అయితే ప్రతిపక్షంలో కూర్చుంటాం కానీ అధికారం కోసం దిగజారం అని ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయి తిరిగి ప్రజా తీర్పు కోరిన ఆదర్శ నాయకుడు,
ప్రపంచ దేశాల ఆంక్షలను, బెదిరింపులు లెక్క చేయకుండా ప్రోక్రాన్ లో అణుపరీక్షలు నిర్వహించిన ధైర్య వంతుడు ,
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశం నలుమూలల స్వర్ణ చతుర్బుజ్ జాతీయ రహదారుల రూపకర్త,గ్రామాలను ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా దేశం లోని అన్ని గ్రామాలను రహదారులు నిర్మించి పట్టణాలకు అనుసంధానం చేసిన మహనీయుడు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి  అని ఆయన సేవలను కొనియాడారు.అనంతరం నాయకులకు మిఠాయిలు తినిపించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కాటన్ పల్లి ఆంజనేయులు, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేందర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శిలు సి హెచ్ హనుమంతు,పాశం నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు రాంపూర్ రామకృష్ణ,వార్డు సభ్యులు కట్టన్ పల్లి మహిపాల్, మండల ఉపాధ్యక్షులు బైరం యాదయ్య, పెరమళ్ళ వెంకటేష్, యువ మోర్చా మండల ఉపాధ్యక్షులు చలివేంద్రం మహేష్, మండల ట్రెజరర్ కొండ ఆంజనేయులు,మిద్దె హనుమంతు, బూత్ అధ్యక్షులు మొగులయ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *