- క్లౌడ్ బరస్ట్‌తో 12మంది మృతి
- పలువురి పరిస్థితి విషమం
శ్రీనగర్, ఆగస్టు 14: జమ్మూ కాశ్మీర్ కిష్టావర్ జిల్లా పద్దార్ సబ్ డివిజన్ పరిధిలోని చిషోీ గ్రామ పరిసర ప్రాంతంలో గురువారం మేఘ విస్ఫోటనం సంభవించింది. ఆ క్రమంలో మెరుపు వరదలు సంభవించి 30మందికి పైగా యాత్రికులు మరణించారు. ఈ ఘటనలో 38మంది మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మాచైల్ మాతా యాత్ర మార్గంలో ఈ గ్రామం ఉంది. మాచైల్ మాతా (చండీ) దర్శనానికి వెళ్లే యాత్ర బేస్ పాయింట్ ఇదే. ఇక్కడ యాత్రికులు తమ వాహనాలను ఉంచి కాలినడకన దర్శనాని వెళ్తుంటారు. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడిరచారు. 96మందిని కాపాడగా వీరిలో 28మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. 35మందిని జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కిష్టావర్ డిప్యూటీ కమిషనర్ పంకజ్ కుమార్ శర్మ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
మాచైల్ మాతా యాత్ర మార్గంలో విషాదం





