సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: గజ్వేల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో సర్పంచ్ విజయ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొల్ల కుర్మాలకు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం మూడు యూనిట్లు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం అద్భుతాలు సృష్టిస్తున్నదన్నారు. గజ్వేల్ మండలంలోని బూర్గుపల్లి గ్రామానికి మూడు యూనిట్లు, దిలాల్పూర్ గ్రామానికి ఎనిమిది యూనిట్లు మంజూరు అయ్యాయని, వాటిని దిలాల్పూర్ లో సర్పంచ్ దివ్య దయాకర్ రెడ్డి పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించిన ఈ పథకం గొల్ల కురుమల కులవృతికి పూర్వ వైభవాన్ని తీసుకొని రావడమే కాకుండా వారిని ఆర్థికంగా నిలబెడుతున్నదని అన్నారు.దేశంలోనే అత్యధిక గొర్రెలు గల రాష్ట్రంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందనిన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగం అనుబంధ వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న అన్ని కులాలకు అభివృద్ధి ఫలాలను అందిస్తూ సబ్బండ వర్గాల అభివృద్ధి ద్వెయంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు.గొల్ల కూర్మలకు ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్ 20 ప్లస్ వన్ ఇరవై గొర్రెలు ఒక పొట్టేలు చొప్పున వారికి అందిస్తున్న విషయాన్ని వారు స్పష్టంచేశారు. వీరికి ఒక యూనిట్ కోసం 43750 రూపాయలతో డీడీలు చెల్లింపు చేయగా వారికి 131250 ప్రభుత్వం చెల్లిస్తుందని ఈ పథకం మొత్తంలో భాగంగా 17500 రూపాయలు గొల్ల కురుమాలకు లబ్ది జరుగుతుందని వారు తెలిపారు.ఇంత పెద్ద మొత్తంలో వారి శ్రేయస్సు కోసం ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. ఇప్పటికి గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా రన్ అవుతుందని మాంసం ఎగుమతిలోనూ తెలంగాణ రాష్ట్ర నెంబర్ వన్గా ఉందని అన్నారు. 10 ఎకరాల్లో 10 కోట్లతో యాదవ భవన్ నిర్మించిన విషయాన్ని వారు తెలిపారు. గొర్రె కాపరులను ఆర్థికంగా పటిష్టం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన గొర్రెల పంపణీ కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతం అయిందని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమలపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు.కానీ నేడు తెలంగాణలో ప్రజాసంక్షేమము కోసం అమలు చేసి ఇతర పార్టీలకు సమాధానం చెప్పిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. భారతదేశంలో ఎక్కువ మాంసం ఎగుమతి చేసే రాష్ట్రం ఏదంటే, తెలంగాణ అని అనేలా చేసి గ్రామీణ ప్రాంతాల ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసిన ఘనత కేసీఆర్ ది మాత్రమే అన్నారు. ఇటీవలే కుల వృత్తులను ప్రోత్సహించడం కోసం వివిద బీసీ కుల వృత్తులను నమ్మికొని జీవనం సాగిస్తున్న వారికి ఒక లక్ష రూపాయలు అందిస్తున్న విషయాన్ని వారు స్పష్టంచేశారు. తెలంగాణలోని ప్రజలందరి చేతుల్లో సంపద పెంచాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం నెరవేర్చే దిశగా ప్రజాపరిపాలన సాగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్, అబ్దుల్, మండల ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజు, ఉప సర్పంచ్ మల్లేశం, సెక్రటరీ నాగరాజు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


