మహేశ్వరం నియోజకవర్గ ఉద్యమకారుల కో-కన్వీనర్ గా కాకి నరసింహ ముదిరాజ్

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 17: మహేశ్వరం నియోజకవర్గం కో-కన్వీనర్ గా కందుకూరు మండల పరిధిలోని మిర్ఖాన్ పేట్ గ్రామానికి చెందిన కాకినరసింహ ముదిరాజ్ ను నియమిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తన నివాసంలో గురువారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,కష్టపడే వారికి ఎల్లవేళలా పదవులు దక్కుతాయని మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా కాకినాడ నరసింహ చేసిన ఉద్యమం అచంచలమైనదని మంత్రి కొనియాడారు. టిఆర్ఎస్ ఏర్పాటు నుండి మహేశ్వరం నియోజకవర్గంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉద్యమస్ఫూర్తిని ప్రతి యువతీ, యువకులకు అందించిన ఘనత నర్సింహదేనన్నారు.కేసీఆర్ కు వెన్నంటి ఉండి పార్టీ పటిష్టతకు ఆయన చేసిన సేవలు అమోఘమని అన్నారు.ప్రతి కార్యకర్త ఉద్యమకారులు నిబద్దతతో ఉండి పార్టీకి సేవలందించే దయాగుణం ఉన్నవారికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి పదవులు అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు.ఈ సందర్భంగా కాకి నరసింహా ముదిరాజ్ మాట్లాడుతూ,తనపై నమ్మకం ఉంచి తనకు పదవి కట్టబెట్టినందుకు మంత్రికి,బిఆర్ఎస్ పార్టీ నాయకులకు,కెసిఆర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న మంత్రి సబితా రెడ్డిని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను కష్టపడి ఆమె గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.రానున్న కాలంలో ముచ్చటగా మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని ఆయన తెలిపారు.ప్రతి కార్యకర్త, నాయకులతో కలసి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *