మహిళా సమ్మాన్‌ ‌బచత్‌ ‌పత్ర పొదుపు పథకం

మహిళల కోసం ప్రత్యేక పొదుపు పథకం
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌బడ్జెట్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్‌ ‌బచత్‌ ‌పత్ర పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఇది వన్‌ ‌టైమ్‌ ‌చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇది రెండేళ్ళ కాలానికి అంటే 2025 వరకు అందుబాటులో ఉంటుంది. దీనిపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.

అవసరమైనపుడు పాక్షికంగా సొమ్మును ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించారు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. సీనియర్‌ ‌సిటిజన్స్ ‌పొదుపు పథకంలో పెట్టుబడి గరిష్ఠ పరిమితిని రెట్టింపు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.15 లక్షల వరకు గరిష్ఠంగా పొదుపు చేసుకునే అవకాశం ఉందని, దీనిని రూ.30 లక్షలకు పెంచినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *