ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 22 : తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో మహిళా సంఘం సభ్యులకు సమావేశ భవనాన్ని మంజూరు చేసి భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్, ఎంపిపి తిరుమణి నిర్మల శ్రీశైలం గౌడ్ లు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారుగా 35 పొదుపు సంఘాలలో దాదాపుగా 500 పై చిలుకు మహిళలు సంఘాల ద్వారా లబ్ది పొందుతున్నారనీ రాంపూర్ గ్రామంలో మహిళా సంఘాలు సమావేశం ఏర్పాటు చేసుకొనిటకు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారు ఎమ్మెల్యేకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్, సర్పంచ్ దశరథ నాయక్, నాయకులు శేఖర్, రమేష్ , శ్రీకాంత్’, కృష్ణ, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.




