మహిళా శాస్త్రవేత్తగా గీతం పరిశోధకురాలు ఎంపిక

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని పరిశోధకురాలు డాక్టర్ కళ్యాణి పైడికొండలను మహిళా శాస్త్రవేత్తగా భారతీయ శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టి) ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఆమె పరిశోధనల మార్గదర్శి (రీసెర్చ్ గైడ్), రసాయన శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల బుధవారం తెలియజేశారు. క్యాన్సర్ వ్యాధుల చికిత్స కోసం శక్తివంతమైన నిరోధకాలను గుర్తించి, ఆ ప్రతిపాదనలను డీఎస్టికి ఆమె సమర్పించారన్నారు. పరిశోధనలో సమకూరిన విజయాలు, సామాజిక ప్రయోజనాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నందుకు గాను ఆమెను మహిళా శాస్త్రవేత్తగా డీఎస్జీటీ ఎంపిక చేసినట్టు తెలిపారు. డాక్టర్ కళ్యాణి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి రసాయన శాస్త్రంలో ఎమ్మెస్సీని, హైదరాబాద్ లోని జేఎన్టీయూ నుంచి పీహెచ్డీ పట్టాను పొందారని, ఇప్పటివరకు దాదాపు 40కి పైగా పరిశోధనా పత్రాలు వివిధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ ప్రచురితమైనట్టు రాంబాబు పేర్కొన్నారు. గతేడాది కర్ణాటకలోని బెల్గాంలో జరిగిన జాతీయ సదస్సులో డాక్టర్ కళ్యాణి సమర్పించిన పరిశోధనా పత్రం అత్యుత్తమైనదిగా ఎంపికైకైందన్నారు. క్యాన్సర్ చికిత్సలో రసాయనాల ప్రభావంపై డాక్టర్ కళ్యాణి ఐదు పుస్తకాలను ప్రచురించినట్టు తెలిపారు. రాబోయే తరాలను క్యాన్సర్ వ్యాధి బారి నుంచి రక్షించే ఔషధాల రూపకల్పనే ధ్యేయంగా ఆమె పరిశోధనలను కొనసాగిస్తున్నట్టు డాక్టర్ రాంబాబు వివరించారు. మహిళా శాస్త్రవేత్తగా ఎంపికెన డాక్టర్ కళ్యాణిని గీతం రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, మరో పరిశోధనా మార్గదర్శి ప్రొఫెసర్ కె.ఎం. ప్రకాష్ తదితరులు అభినందించినట్టు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *