• స్వయం సహాయక సంఘాలకు 2022-23లో రూ.12,684.59 కోట్ల రూణాలు
  • మహిళా భద్రత కోసం షీ టీమ్స్
  • ‌కల్యాణ లక్ష్మి/షాదీముబారక్‌ ‌ద్వారా 10 వేల కోట్ల ఆర్థిక సహాయం
  • కెసిఆర్‌ ‌కిట్‌తో ఇప్పటి వరకు 13,29,951 మందికి లబ్ధి…రూ. 1176.54 కోట్లు ఖర్చు

హైదరాబాద్‌, ‌మార్చ్ 07 : ‘‘‌యత్ర నార్యస్తు పూజ్యంతే…రమంతే తత్ర దేవతాః…ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు పూజలందుకుంటారు. ఎక్కడ స్త్రీలను, గౌరవించరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైనా ఫలించవు. భారత సంస్కృతిలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మహిళలు జనాభాలో సగమైనా సాధికారత పొందకుండా నవభారత స్వప్నం సాకారం కావడం అసంపూర్ణమే అవుతుంది. అ విధంగా ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. దేశంలో ఎక్కడ లేని పథకాలను అమలు పర్చింది. మహిళా అభివృద్ధి కోసం స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జిలు), ఆరోగ్య లక్ష్మీ, కల్యాణ లక్ష్మీ , మహిళా భద్రత కోసం షీ టీమ్స్, ‌భరోస కేంద్రాలు, ఈ విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు పరిచి దేశంలో మహిళ సాధికారతలో ప్రథ•మ స్థానంలో ఉన్నది. నీతి ఆయోగ్‌ ‌సంస్థ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది.

మహిళా సంఘాలు పటిష్టం
ఈనాడు మహిళల ప్రభావం విద్య, విజ్ఞానం, రాజకీయం. వ్యాపారం, క్రీడలు తదితర రంగాలన్నింటిలోనూ విస్తరిస్తుంది. ఈ వాస్తవాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళల సమగ్ర వికాసానికి అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నది. అందులో భాగంగానే మహిళలను సంఘటిత శక్తిగా తయారుచేయడమే లక్ష్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని మహిళలలో దాగి ఉన్న శక్తిని సమాజానికి ఉపయోగపడటానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది. మహిళలను పొదుపు వైపు మళ్ళించడం ద్వారా ఆ కుటుంబాన్ని ఆర్ధికంగా బలోపేతం చేయడం, అదే సమయంలో ఆర్థిక క్రమ శిక్షణ వైపు మళ్లించడం సంఘాల ఏర్పాటులో ముఖ్య ఉద్దేశం.  మహిళా సాధికారతలో స్వయం సహాయక బృందాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బ్యాంకు లింకేజీలను సులభతరం చేయడం ద్వారా ఎస్‌హెచ్‌జిలకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయబడిన మొత్తం మూడు రెట్లు పెరిగింది. 2014-15లో రూ.3,738.67 కోట్లు ఉండగా, 2022-23 నాటికి రూ.12,684.59 కోట్లకు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న 18,680ఎజిహెచ్‌లకు 1,458.97 కోట్లు అందించారు.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో నాలుగున్నర లక్షల  మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలలో 46,66,523 మంది సభ్యులు ఉన్నారు. స్వయం సహాయక సంఘాలు ప్రారంభించిన ఆరు నెలల అనంతరం వారి ఉపాధికి అవసరమైన రుణాలను బ్యాంకు ద్వారా ఇప్పిస్తున్నారు.  గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలతో అనేకమంది స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో 3,60,311 స్వయం సహాయక సంఘాలు ఉండగా,  తెలంగాణ ఏర్పడిన అనంతరం గత ఎనిమిదేళ్ల లలో 76,321 స్వయం సహాయక సంఘాలను కొత్తగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని, గ్రామీణ ప్రాంతాలలో  ప్రస్తుతం 4,36,512  మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. గ్రామాలలో మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాల వల్ల అనేక మంది మహిళల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయి. కార్యక్రమం పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్రంలో 32 జిల్లా సమాఖ్య లను ఏర్పాటు చేయబడ్డాయి. రాష్ట్రంలో 553 మండల సమాఖ్యాలు, 17,954 గ్రామ సమాఖ్య పనిచేస్తున్నాయి.

రాష్ట్రంలోని  గ్రామీణ ప్రాంతాలలో 46,66,523 మంది సభ్యులలో 4,36,512 మహిళా స్వయం సహాయక  సంఘాల ఏర్పాటు. 2014-15 నుండి 2021-22 వరకు గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం  సహాయక  సంఘాలకు 56,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సెర్ప్ ‌ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు15,000 కోట్ల రూపాయలు బ్యాంక్‌ ‌లింకేజి కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించబడింది. రాష్ట్రంలోని గ్రామీణ మహిళా స్వయం  సహాయక  సంఘాల ఉత్పత్తులను దేశ, విదేశాలలో విస్తృత మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించేందుకు ఈ కామర్స్  ‌సంస్థ  ఫ్లిప్‌ ‌కార్ట్‌తో సెర్ప్ ఒప్పందం చేసుకున్నది.

మహిళా భద్రత కోసం షీ-టీమ్స్
‌తెలంగాణ రాష్ట్ర అవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతా, సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలి సారిగా అడిషనల్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌పోలీస్‌ అధికారి స్థాయి ఆధ్వర్యంలో ‘‘ఉమెన్‌ ‌సేఫ్టీ వింగ్‌’’‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మహిళల ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మహిళా భద్రతా విభాగంలో షీ టీమ్స్, ‌భరోసా, షీ భరోసా సైబర్‌ ‌ల్యాబ్‌, ‌మానవ అక్రమ రవాణా నివారణతో పాటు ఆపరేషన్‌ ‌స్మైల్‌, ‌ముస్కాన్‌ ‌ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుంది. మహిళలు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై వారు ప్రత్యేక్షంగా గాని, పరోక్షంగా గాని భరోసా కేంద్రాలలో ఫిర్యాదు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా 2021 సంవత్సరంలో మొత్తం 5145 ఫిర్యాదులు అందగా వాటిని సమర్థవంతంగా పరిష్కరించడం జరిగింది.

మహిళలు సమాజంలో ఎదుర్కుంటున్న పలు సమస్యలపై వారికి కౌన్సిలింగ్‌ ‌నిర్వహించి వారీలో భరోసా కల్పించె దిశగా రాష్ట్రంలో 6 భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌, ‌వికారాబాద్‌,   ‌వరంగల్‌ , ‌సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేటలో ఏర్పాటు చేసిన ఈ భరోసా కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నాయి. వీటితోపాటు కొత్తగా మేడ్చల్‌ , ‌మాల్కాజ్‌ ‌గిరి, మెదక్‌ , ‌ఖమ్మం, కరీంనగర్‌ ‌జిల్లాలలో ను ఏర్పాటు చేసేందుకు పోలీస్‌ ‌శాఖ చర్యలు తీసుకుంటుంది. అదే విధంగా హైదరాబాద్‌ ‌పాత బస్తీ, సైబరాబాద్‌ , ‌రాచకొండ పోలీస్‌ ‌కమీషనరేట్ల పరిదిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

కల్యాణ లక్ష్మి/ షాదీముబారక్‌ ‌పథకం బాల్య వివాహాలను అరికట్టాలనే లక్ష్యంతో, తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి/షాదీముబారక్‌ ‌పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలకు చెందిన వధువులకు ఆర్ధిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక భారం నుండి ఉపశమనం కల్పించే చర్యలలో భాగంగా ‘కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్‌’ ‌పథకం  ప్రవేశపెట్టింది. మహిళలు కుటుంబానికి భారం కాకూడదనే సదుద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేసింది. తద్వారా వధువు వివాహాం ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఈ పథకం కింద వధువుకు పెళ్లి సమయంలో ఆర్ధిక సహాయం, వధువు తల్లి బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. 18 ఏళ్లు దాటిన మహిళలు వారి పెళ్లిఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయం కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పథకం అమలులోకి వచ్చిన తరువాత బాల్యవివాహాల శాతం తగ్గడమే కాకుండా మహిళ అక్షరాస్యత మెరుగుపడింది. అంతేకాకుండా ఆడపిల్లల తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలు మించకూడదు. కల్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకొనేవారు అధికారిక వెబ్‌ ‌సైట్‌ ష్ట్ర••‌జూ•://•వశ్రీ•అస్త్ర•అ•వజూ•••.•స్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅలో ఆన్‌ ‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వధువు తమ వివాహానికి నెల రోజుల ముందుగానే మీసేవ కేంద్రాల వద్ద ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 2023 వరకు, మొత్తం 2.4 లక్షల ఎస్‌సి, 1.5 లక్షలు ఎస్టీ, 5.9 లక్షల బీసీ, 2.4 లక్షల మైనార్టీ కుటుంబాలు లబ్ధి పొందాయి. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలకు చెందిన వధువులకు రూ.10 వేల కోట్ల ఆర్ధిక సహాయం చేశారు.
తల్లీ బిడ్డ ఆరోగ్య సంరక్షణకు కెసిఆర్‌ ‌కిట్‌ ‌పథ•కం…అమలు చేస్తున్న ఎకైక రాష్ట్రం
కెసిఆర్‌ ‌కిట్‌తో ఇప్పటి వరకు 13,29,951 మందికి లబ్ధి

image.png
ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్‌ ‌తరాలు ఆరోగ్యవంతులుగా ఎదిగేందుకు ఆటంకంగా ఉన్న పోషకాహార,ఇమ్మ్యూనైజేషన్‌ ‌లోపాలను అధిగమించుటకు కె.సి.ఆర్‌.‌కిట్‌ ‌పథకాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలుచేస్తున్నది. మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అనవసర సిజెరియన్‌ ‌ప్రసవాలను అరికట్టుటకు  ప్రభుత్వ  ఆసుపత్రులలో జరిగే ప్రసవాల సంఖ్యను గణనీయంగా పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. మాతా శిశు మరణాలను తగ్గించుట కూడా ప్రభుత్వ సంకల్పం. ఇటువంటి ఉన్నత లక్ష్యాల సాధనకు వినూత్న వరవడితో దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్న కెసిఆర్‌ ‌కిట్‌ ‌పథ•కంతో ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇద్దరు పిల్లల వరకు కె.సిఆర్‌ ‌కిట్‌ ‌కింద ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన మగ శిశువుకు రూ.12,000/-, ఆడశిశువు పుడితే రూ 13,000/- లను ఆర్ధిక సహాయంగా నాలుగు విడతలలో ప్రభుత్వం అందిస్తున్నది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసావానంతనరం కూడా తల్లీ బిడ్డకు అవసరం అయిన అన్ని రకాల వైద్య పరీక్షలు, ఇమ్మ్యూనైజెషన్‌ ‌వాక్సినేషన్లను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నది.  కేసీఆర్‌ ‌కిట్‌ ‌పథకాన్ని 2017 జూన్‌ 2‌న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు ప్రారంభించారు. ప్రభుత్వ దవాఖానాలలో ప్రసవాలను పెంచుట, ప్రసూతి మరణాలు, శిశు మరణాలను తగ్గించడమే కేసీఆర్‌ ‌కిట్‌ ‌ప్రధాన లక్ష్యం. గర్భిణీకి అవాంతరాలు లేని ప్రభుత్వ వైద్య సంరక్షణను ప్రసవానంతరం కూడా అందించుటకు ఆయా ప్రాంతాల వైద్యులు, సిబ్బంది రెగ్యులర్‌గా మానిటరింగ్‌ ‌చేస్తున్నారు. ఈ పథకం ఇద్దరు జీవించి ఉన్న పిల్లలకు మాత్రమే పరిమితం చేయబడింది.
అయితే 2018 ఆగస్టు 2 నుండి ప్రత్యేక ఆదివాసీ గిరిజన తెగల సంరక్షణ, మనుగడకు కెసిఆర్‌ ‌కిట్‌ ‌నిబంధనలుకు ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. తద్వారా అమలులోకి వొచ్చిన నిబంధనలు ప్రకారం కేసీఆర్‌ ‌కిట్‌ ‌ప్రయోజనాలను 2వ సంతానానికి మించిన చెంచు, కోలం, కొండరెడ్లు వంటి ప్రత్యేకించి ఆదివాసీ గిరిజన సమూహాలకు వర్తింపచేస్తున్నారు. ఈ పథ•కం కింద రిజిస్టర్‌ అయిన గర్భిణీకి అవసరం అయిన టీకాలను, విటమిన్లను ప్రభుత్వ వైద్య సిబ్బంది ఉచితంగా అందిస్తున్నారు. కెసిఆర్‌ ‌కిట్‌ ‌కింద 2017 నుండి ఇప్పటి వరకు 13,29,951 మంది లబ్ధిపొందారు. కెసిఆర్‌ ‌కిట్‌ ‌పథకం అమలుకు ప్రభుత్వం రూ.1176.54 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. అలాగే రూ.243.68  కోట్లను ఖర్చు చేసి 11,82,014 కేసీఆర్‌ ‌కిట్‌లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతి కిట్‌లో శిశువు ఆరోగ్య సంరక్షణకు అవసరం అయిన 15 రకాల వస్తువులను ప్రభుత్వం అందజేస్తున్నది.

– కమిషనర్‌, ‌సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్‌ ‌వారిచే జారీ చేయనైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *