మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 26: సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని చేవెళ్ల గ్రామ సర్పంచ్ బండారి శైలజఆగిరెడ్డి చేవెళ్ల సొసైటీ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి ముడిమ్యాల సొసైటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు.చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీరవనిత ఐలమ్మ అని కొనియాడారు.నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత అని ఆమె పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు దేవర సమత రెడ్డి,ఉప సర్పంచ్ గంగి యాదయ్య,మాజీ ఉపసర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జుకన్నగారి శ్రీకాంత్ రెడ్డి,వార్డు సభ్యులు అశోక్,మాజీ సర్పంచ్ పడాల ప్రభాకర్,నాయకులు మంగలి నర్సింలు,మాజీ వార్డు సభ్యులు చాకలి శ్రీనివాస్,రజక సంఘం సభ్యులు శ్రీనివాస్,శివకుమార్,జంగయ్య,తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *