మహిళల రక్షణ చట్టాల గురించి అవగాహన కల్పించిన అడిషనల్ డిసిపి శ్రీనివాసరావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: జిల్లా పరిషత్ హై స్కూల్ రాఘవాపూర్ విద్యార్థిని విద్యార్థులకు..బాలికల మరియు మహిళల రక్షణ చట్టాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, ఇవిటీజింగ్ పోక్సో షీ టీమ్స్ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కల్పించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందె  శ్రీనివాసరావు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి.సైబర్ నేరాల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి, మీ చుట్టుపక్కల వారికి తెలియపరచాలి.అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు.సోషల్ మీడియాలో మంచిని స్వీకరించి, చెడును తుంచాలి. బాలికల మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం మహిళల భద్రత మా ముఖ్య బాధ్యత.ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్  మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక గోల్ ఏర్పరచుకొని  దాని ప్రకారం చదువుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. మనిషి జీవితంలో చదువు చాలా ముఖ్యమని చదువు సంస్కారం ఉంటే సమాజంలో ఎక్కడైనా బతకవచ్చని సూచించారు. సోషల్ మీడియాలో గుర్తుతెలియని పరిచయాలు చేసుకోవద్దని సూచించారు. ఒకరికొక్కరు తోడుగా ఉండాలి,ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవాలని. ఏదైనా విషయం ఉంటే పెద్దలకు స్నేహితులకు పోలీసులకు తెలియపరచాలి. మీ జీవితంలో ఏదైనా తప్పు జరిగితే వెంటనే పెద్దలకు మరియు బంధువులకు తెలపాలి. ప్రతి విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఏదైనా కష్టపడి సాధించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు, ఎంత పెద్ద సమస్య ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవాలి. మొదటగా నీ రక్షణ నీ బాధ్యత  అని ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. మహిళలు బాలికలు కష్టపడి చదివి ఎన్నో ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారని వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చక్కగా చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు. కష్టపడి చదవాల్సిన వయస్సులో చెడు అలవాట్లకు బానిసలు కావద్దని సూచించారు, కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు.  ఎవరైనా ఎలాంటి వేధింపులకు గురైన వెంటనే షీటీమ్ పోలీసులకు సమాచారం అందించాలని  సమాచారం అందించిన వాళ్ల పేర్లు  గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఎవరు కూడా మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా మంచిగా చదువుకోవాలని, ప్రతి ఒక్కరి రక్షణ గురించి షీటీమ్స్, భరోసా సెంటర్,  పని చేయడం జరుగుతుందని, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే డయల్ 100,  షిటీమ్ వాట్సప్ నెంబర్ 8712667343 మహిళా పోలీస్ స్టేషన్  నెంబర్ 8712667435, ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ చేరాలు, ఎస్ఐ కిరణ్ రెడ్డి, స్కూల్ హెడ్మాస్టర్ శ్రీనివాస్,  అధ్యాపకులు, సిద్దిపేట షీ టీమ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *