మళ్ళీ నిమ్స్‌లో ఆంధ్ర పెత్తనం !

  • విభాగాధిపతుల(హెచ్‌ఓడి)ల ప్రాంతాభిమానం
  • పారా మెడికల్‌ ఉద్యోగ శిక్షణ నియామకాల్లో తెలంగాణ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం..
  • తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ఆగ్రహం
    హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 1 : ‌నిమ్స్‌లో మొత్తం 36 విభాగాలున్నాయి..అనస్థీషియా, నెఫ్రాలజీ విభాగం, రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడికల్‌ ‌కేర్‌, ‌కార్డియాలజీ, సిటీ సర్జరీ, న్యూరాలజీ, అంకాలజీ, రేడియాలజీ, ఇంకా ఇతర ముఖ్య విభాగాల్లో మొత్తం 20 మంది ఆంధ్ర శాఖాధిపతులే ఆధిపత్యం చలాయిస్తున్నారని తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు సర్దార్‌ ‌వినోద్‌ ‌కుమార్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా విభాగాధిపతులు ఇష్టానుసారం తమ ప్రాంతవారికి అక్రమ పద్దతిలో ఉద్యోగాలు కట్టబెట్టారనీ..32వేల జీతంతో కూడిన ఈ ఉద్యోగాల్లో ఒక్క అనస్థీషియా విభాగంలో 20 మంది, మిగతా విభాగాల్లో సుమారు 140 మంది ఆంధ్ర వాళ్ళు యాడాది ఉద్యోగ శిక్షణ పేరుతో చేరి నాలుగేళ్ళుగా ఆ ఉద్యోగాల్లో అక్రమంగా కొనసాగుతున్నారని అన్నారు. అర్హులైన తెలంగాణ బిడ్డలకి అన్యాయం చేస్తూ నియమితులైన ఆంధ్ర వాళ్ళని తక్షణమే తొలిగించి అక్రమ నియామకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. లేకుంటే తాము ఉద్యమిస్తామని తెలంగాణ వినోద్‌ ‌కుమార్‌ ‌మంత్రి హరీష్‌ ‌రావును హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *