తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 4: రాష్ట్రంలో మూడవసారి మళ్లీ టిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోనే విలియం గ్రౌండ్లో నిర్వహించిన టిఆర్ఎస్ యువ ప్రభంజనం కార్యక్రమానికి రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మూడోసారి మళ్లీ టిఆర్ఎస్ పార్టీ హ్యాటరీ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో రెండవసారి గెలిపించాలని కోరారు టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. బిఆర్ఎస్ తోనే ప్రజల సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలకు మోసపోవద్దని ప్రజలకు సూచించారు ఎమ్మెల్యే టిఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీర్వాదంతో తాండూరు నియోజకవర్గంలో 1680 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు గతంలో మంత్రి మహేందర్ రెడ్డి కూడా తాండూరు అభివృద్ధికి కృషి చేశారని అన్నారు తాండూరు నియోజకవర్గ గురించి తెలియని వ్యక్తికి ఓట్లు వేస్తే అవి దండగ అవుతాయని, అభివృద్ధి చేసి టిఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేయాలని అన్నారు గత ఎన్నికల్లో తాండూర్ నియోజకవర్గంలో తన గెలుపుకు యువత ఎంతో కృషి చేశారని అన్నారు.తెలంగాణలో ఇస్తున్న సంక్షేమ పథకాలను వాళ్ళ రాష్ట్రాలలో అమలు చేయడం వాళ్లకు చేతగాక ది ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఉంది అంటే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలోగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న ప్రభుత్వం మనకు ఉంది కాబట్టే ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉన్నాం. అని అన్నారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తనయుడు డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుందని అందులో భాగంగానే తాండూర్లో బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న యువ నాయకుడు టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బీసీ సంఘం మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా భారీ మెరిసేటితో గెలుపొందడం ఖాయమని అన్నారు.ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీశైలం రెడ్డి బీసీ సంఘం నాయకులు రాజ్ కుమార్ యువజన విభాగం నాయకులు అనిల్ నియోజకవర్గంలోని యువకులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ మూడవసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం





