ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 1: మంచాల మండలం నుండి ఆరుట్ల గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు వార్డు సభ్యులు తోపాటు వెయ్యి మంది కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో త్వరలో బిఆర్ఎస్ పార్టీ నుండి భారీ చేరికలు ఉంటాయని ప్రజల చేతిలో బిఆర్ఎస్ పార్టీకి పతనం తప్పదని ఆయన ఈ సందర్బంగా హెచ్చరించారు.పట్నంలో రోజురోజుకు కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతుందని మల్ రెడ్డి తెలియజేశారు.తండ్రీ కొడుకుల వల్ల ప్రజలు విసుగు చేందారని ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్దాంగ ఉన్నారని ఆయన అన్నారు. .తెలంగాలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి చొచ్చుకుపొయాయని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన



