మల్లారెడ్డి సమక్షంలో బీఆరెస్ లోకి యువత

  ఘట్కేసర్ ప్రజాతంత్ర నవంబర్ 1 : మేడ్చల్ జిల్లా, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ శివాజీ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజా నాయక్, విక్రమ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో 600 మంది యువత బుధవారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో చేరారు . ఈ సందర్భంగా రాజానాయక్ మాట్లాడుతూ, మల్లారెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి బిఆర్ఎస్ పార్టీలో చేరానని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డిని అత్యధిక బంపర్ మెజార్టీతో గెలిపిస్తానని అన్నారు. రానున్న రోజుల్లో మరో 1000 మంది యువత  మల్లారెడ్డి సమక్షంలో చేరుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, పోచారం బిఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు మందాడి సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గొంగళ్ళ బాలేష్, బాలగోని వెంకటేష్ గౌడ్, మెట్టు బాల్రెడ్డి,  సుర్వి రవీందర్, నర్రి కాశి, ఆకిటి బాల్రెడ్డి, నాయకులు, నల్లవెల్లి నాగరాజ్, యువత, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *