మల్లారెడ్డి గెలుపు తథ్యం చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  21:  మంత్రి మల్లారెడ్డి గెలుపు తద్యమని దమ్మాయిగూడ   మున్సిపల్  చైర్మన్  వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్    అన్నారు. చైర్మన్  మంగళవారం  మేడ్చల్ నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డిని  గెలిపించాలని  బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి  మున్సిపల్ పరిధిలోని  పలు వార్డుల్లో     జోరుగా   ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి మంత్రి మల్లారెడ్డిని   భారీ  మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.రెండోసారి ఎమ్మెల్యేగా  మల్లారెడ్డి విజయం ఖాయమని  అన్నారు.  ప్రచారంలో ప్రజల నుంచి   విశేష  స్పందన లభిస్తుందని  తెలిపారు. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రచారం చేసే నాయకులను  ప్రజలు నమ్మరని తెలిపారు.  బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని  ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  ఈ  కార్యక్రమంలో బిఆర్ఎస్  నాయకులు తదితరులు     పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *