మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఫేక్ అపాయింట్మెంట్లు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 03 : మేడ్చల్ ప్రాంతంలోని కండ్లకోయాలో ఉన్న ప్రముఖ గ్రూప్ విద్య సంస్థలో తప్పిదాలు జరుగుతున్నాయని, తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్(టీఎస్ టీసీఈఏ) రాష్ట్ర అధ్యక్షులు అయినేని సంతోష్ కుమార్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల పేర్ల మీద ఉన్నత సంస్థల ఫేక్ అపాయింట్ మెంట్ లు తయారు చేసి న్యాక్ కి సబ్మిట్ చేసారని, న్యాక్ గ్రేడ్ ల కోసం ఇలా ప్రక్క దోవ తొక్కుతున్నారని ఆరోపించారు. గతంలో ఇదే గ్రూప్ ఆఫ్ విద్య సంస్థలో ఒక కాలేజ్ బ్లాక్ లిస్ట్ మరవక ముందే మరల మరొక కాలేజి లో ఫేక్ అపాయింట్ మెంట్ లు తయారు చేయడం చూస్తే, వారి దోరణి ఏ విధంగా ఉన్నదో అర్థం అవుతుందన్నారు. ఫేక్ అప్పాయింట్ మెంట్ లు, తప్పిదాలకు పాల్పడ్డ వారిమీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటిపై జేఎన్టీయూహెచ్, న్యాక్, ఏఐసిటిఈ సంస్థలకు పిర్యాదు చేస్తామని సంతోష్ కుమార్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *