కాంగ్రెస్ ఇక్కడ పోటీలో లేనట్లే
చేవెళ్లలో రిజెక్ట్ చేసిన అభ్యర్థిని పెట్టారు
మల్లారెడ్డి తలచుకుంటే ఇక్కడ ఘనవిజయం సాధ్యం
నియోజకవర్గ స్థాయి సమీక్షలో వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మేడ్చల్ మల్కాజ్‌గిరి,ప్రజాతంత్ర,ఏప్రి
అయితే గెలిచింది మల్లారెడ్డి అంటున్నారు కానీ గెలిపించింది రు. రు కష్టపడితేనే 10కి 10 గెలిచాం. ఎంతో కమిట్ మెంట్ ఉంటేనే ఇది సాధ్యమైంది. మేడ్చల్‌లో బీఆర్‌ఎస్ బలమేందో తెలిసిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సామాజిక సేవలు చేస్తూ మల్కాజ్‌గిరి పార్లమెంట్‌లోని ప్రజలతో కలిసి మెలిసి ఉన్నారు. బ్రహ్మాండంగా ఆయనకు సేవాగుణం ఉంది. వారిని కేసీఆర్ పిలిచి ఆశీర్వదించి అభ్యర్థిగా ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అని చెప్పుకునే బాపతి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ పేర్కొన్నారు.తూంకుంట నుంచి జేబీఎస్ వరకు, కండ్లకోయ నుంచి ప్యాట్నీ వరకు స్కైవే నిర్మిస్తామని, 100 ఎకరాలు రక్షణ భూములు ఇవ్వాలని ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిస్తే లాభం లేకుండా పోయింది. చివరకు గతేడాది ఆగస్టులో తెలుగు అధికారి గిరిధర్‌ను.. నేను మంత్రిగా, సీఎస్ శాంతి కుమారి వెళ్లి కలిసి స్కైవేలపై చర్చించాం. ఆయన పుణ్యమా అని మొన్న ఆర్డర్ బయటకు వచ్చింది. ఆ ఆర్డర్ బీజేపీ, కాంగ్రెస్ వల్ల ఏం రాలేదు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అని చెప్పుకునే బాపతి రేవంత్ రెడ్డి. ఎందుకంటే.. 100 రోజుల్లో స్కైవే నిర్మాణాలకు ఆర్డర్ నేనే తెచ్చాను అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటుండు. చెప్పుకునేందుకు ఇజ్జత్ ఉండాలి. కనీసం ఆలోచన ఉండాలి. ఒక ఫైల్ రావాలంటే నెలలు పడుతుంది. ఆగస్టులో పని అయిపోయింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.
ఎన్నికల కోడ్ కారణంగా.. మొన్న ఆర్డర్ వచ్చింది. రు గెలుస్తరు అనుకోలేదు. మేం ఓడుతామని అనుకోలేదు. కానీ అదృష్టం బాగుండి రేవంత్ సీఎం అయ్యారు. కానీ పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. నిన్న మొన్నటి దాకా బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అని ప్రచారం చేసిండు. కేంద్రంతో కేసీఆర్ పంచాయితీ పెట్టుకున్నాడు కాబట్టి స్కైవేలకు అనుమతి ఇవ్వలేదు.. నేను మంచిమాట చెబితే ఇచ్చారని రేవంత్ రెడ్డి డైలాగులు కొడుతున్నారు. కానీ వాస్తవం రేవంత్‌కు తెలుసు. కాగితం నీ చేతికొచ్చే వరకు నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నావు అని రేవంత్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు. మన గవర్నమెంట్ లో ఒక లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం. కానీ చెప్పడంలో ఫెయిలయ్యాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఎల్‌బీ స్టేడియంలో టింగ్ పెట్టి మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకుంటుండు. మరి నువ్వు వచ్చిన తర్వాత ఎన్నినోటిఫికేషన్లు ఇచ్చావు.. ఎన్ని పరీక్షలు పెట్టావు. కేసీఆర్ హయాంలో 30 వేల ఉద్యోగాలు ఇస్తే.. వాటికి కాగితాలు ఇచ్చి నేనే ఇచ్చానని చెప్పుకుంటున్నావు. ఇలా ఇచ్చి మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అని చెప్పుకుంటుకున్నావు. కాంగ్రెసోళ్లు పచ్చి మోసగాళ్లు.. రెండు లక్షల ఉద్యోగాలు ఒకే ఏడాదిలో ఇస్తానని చెప్పాడు. తెలంగాణ పిల్లలు చైతన్యవంతులు అమాయకులు కాదు.. 30 వేల ఉద్యోగాలు నీ ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. అది కేసీఆర్ ఖాతాలోకి వెళ్తుంది. మాటిచ్చిన ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీ ఆర్ సీరియస్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతోనే తమ ఫోన్‌లను ట్యాపింగ్ చేశారంటూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వార్తలపై కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ నేతలు, మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవసరమైతే కోర్టుకు వెళ్తానంటూ హెచ్చరించారు. నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, మంత్రి కొండా సురేఖ పై కోర్టుకు వెళ్తానని అన్నారు. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటానని తెలిపారు. నిరాధారమైన, మతిలేని ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు మంత్రి కొండా సురేఖ, కేకే మహేందర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో లీగల్ నోటీసులు.. పరువు నష్టం దావాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాస్తవాలను సరి చూసుకోకుండా… ఇలాంటి వార్తలను ప్రచురించే డియా సంస్థలకు కూడా లీగల్ నోటీసులు పంపిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో తవ్వే కొద్దే అనేక సంచనల విషయాలు వెలుగులోకి వొస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఎస్‌ఐబీ డీఎస్పీ ప్ర ణీత్‌రావు, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ అయ్యారు.
అలాగే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్‌పై కేసు నమోదైన వెంటనే ఆయన అమెరికా వెళ్లిపోయారు. ప్రభాకర్ ఆదేశాల మేరకే హార్డ్ డిస్కులను ప్రణీత్‌రావు ధ్వంసం చేసినట్లు విచారణలో నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం వాటిని రికవరీ చేసిన పోలీసులు.. డిస్కుల నుంచి సమాచారాన్ని రిట్రీవ్ చేసే పనిలో పడ్డారు. మరోవైపు ప్రణీత్ రావుతో పాటు మాజీ అధికారి రాధాకిషన్ రావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. బీఆర్‌ఎస్ కోసం పోలీసులు డబ్బును తరలించడం.. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నగదును సీజ్ చేయడం వరకు ప్రభాకర్‌రావు ’స్పెషల్ ఆపరేషన్ టీమ్’ విధులను రాధాకిషన్ వివరించినట్లు రిమాండ్ రిపోర్టు స్పష్టం చేస్తోంది. పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును ఇంటెలిజెన్స్ చీఫ్(ఓఎస్‌డీ)గా నియమించడం గత ప్రభుత్వ పెద్దల వ్యూహాత్మక చర్య అని రాధాకిషన్‌రావు పేర్కొన్నట్లు దర్యాప్తు అధికారులు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడిరచారు. ఈ క్రమంలో కేటీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో తీవ్ర కలవరాన్ని రేపుతున్నాయి. అవి నిరాధారమైన ఆరోణలని కేటీఆర్ చెప్పినప్పటికీ ఈ వ్యవహారనికి సంబంధించి పార్టీ అధినేత కేసీఆర్ నుంచి ఎలా స్పందిస్తారన్నది చూడాలి.




