సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగదంపల్లి చౌరస్తా లోని అమరవీరుల స్థూపం వద్ద అమరుడు మలిదశ ఉద్యమకారుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ 14 వర్ధంతిని జరిపిన సిద్దిపేట జిల్లా ముదిరాజులు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ… తెలంగాణ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ విధులు నిర్వహిస్తున్న సమయంలోనే డ్యూటీ రివాల్వర్ తో కాల్చుకొని అమరుడైనరు మరి వారి ఆశయాలు కొనసాగిస్తామన్నారు. ఏ విధమైన తెలంగాణ కావాలి అని కోరున్నారో మరి ఈ రోజు అలాంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయింది అన్నారు. మన నిధులు మన నీళ్లు మన వాటా అనే నినాదంతో ముందుకు సాగిన తెలంగాణ ఉద్యమం నెరవేరిందనీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కిష్టయ్య వారి విగ్రహాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో మండల కేంద్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ నాయకులు జంగిటి శ్రీనివాస్, గాడిచెర్ల సతీష్, పర్శరములు,పడిగే ప్రశాంత్, పాతర్ల వెంకటేశ్వర్లు,బోనాల నాగరాజు,బోనాల శ్రీనివాస్,సూతరి రాజు,గాడిచెర్ల యాదగిరి,చికెన్ సత్తి, జికురు వెంకటస్వామి.కొంతం శ్రావణ్ ముదిరాజ్.బైరి శంకర్,పార్వతి బైరయ్య పైసా రామకృష్ణ, నీలం పర్శరములు, పార్వతి రజినీకాంత్, కోరిమి ఎల్లం లు పాల్గొన్నారు.
మలిదశ ఉద్యమకారుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ 14 వర్ధంతిని జరిపిన సిద్దిపేట జిల్లా ముదిరాజులు



