మరో హైటెక్‌ ‌సిటీగా తుక్కుగూడ మున్సిపాలిటి

  • రూ.6600 కోట్లతో మెట్రోరైలు ఏర్పాటు చేస్తాం.
  • విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 09:‌రామన్న కాలంలో తుక్కుగూడ మున్సిపాలిటిమరో హ్రిటిక్‌ ‌సిటీగా మారబోతుందని ప్రాంతానికి కే.సి. ఆర్‌ ‌కోట్లాది రూపాయల నిధులుమంజూరు చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిపేర్కున్నారు. సోమవారం ఉదయం తుక్కుగూడు.మున్సిపాలిటీ పరిధిలో మహేశ్వరంలోముఖ్యమంత్రి కే.సి.ఆర్‌ ‌పర్యటనలో విడుదలచేసిన 25 కోట్లు, త్రాగునీటికి 50 కోట్లు,కేటాయించి నిధులు, 8కోట్లు రూపాయలు, 35 కోట్లు10 లక్షల వ్యయంతో వాటర్‌ ‌ట్యాంక్‌ 40 ‌లక్షలతోసి.సి రోడ్డు 3 కోట్లతో క్రీడ ప్రాంగణం తుక్కుగూడుమున్సి పాలిటి బురుజుకు 25 లక్షలతోశంఖుస్థాపనలు ప్రారంభోత్సవాలు మాంత్రిచేతులు మీదుగా చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు ప్రజల అవసరాలు తెలుసుకొని వాటి పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు.తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో  తుక్కుగూడలో జరిగిన అభివృద్ధిని సమీక్షించి, రానున్న కాలంలో చేయాల్సిన వాటికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు.

తుక్కుగూడ మునిసిపాలిటీలో ఇప్పటివరకు 50 కోట్లు తాగునీటికి నిధులు మంజూరు చేసినట్లు,పనులు కొనసాగుతున్నాయని అన్నారు. తుక్కుగూడలో రోడ్ల వెడల్పుకు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.కేటీఆర్‌  ‌కృషితో లైట్ల నిర్మాణానికి 5 కోట్ల 50 లక్షలు మంజూరు అయ్యాయన్నారు.ఇప్పటికే తుక్కుగూడ ప్రాంతంలో 58 కంపెనీలు వచ్చాయని, మరో 9 నెలల్లో ఫాక్స్ ‌కాన్‌ ‌సంస్థ నిర్మాణం పూర్తి అవుతుందని,ఈ ప్రాంతంలో లక్షకు పైగా ఉద్యోగులు రానున్నారని,స్థానికులకు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు.రానున్న కాలంలో ఈ ప్రాంతం మరో హైటెక్‌ ‌సిటీగా కానుందన్నారు.అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు లాగా ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ‌చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌, ‌కౌన్సిలర్‌ ‌లు,నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *