మరోమారు వివాదంలో యోగా గురు

సల్మాన్‌ ‌డ్రగ్స్ ‌తీసుకుంటాడన్నరాందేవ్‌ ‌బాబా

హరిద్వార్‌, అక్టోబర్‌ 17 : ‌ప్రముఖ యోగా గురువు రామ్‌ ‌దేవ్‌ ‌బాబా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎప్పుడూ తన మాటలతో ఏదో ఒక విధంగా వివాదాస్పదం అవుతున్న ఆయన..బాలీవుడ్‌లో డ్రగ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ అ‌గ్రనటులంతా డ్రగ్స్ ‌తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్టార్‌ ‌హీరో సల్మాన్‌ ‌ఖాన్‌ ‌డ్రగ్స్ ‌తీసుకుంటాడని..అర్‌ ‌ఖాన్‌ ‌గురించి తనకు తెలియదని రాందేవ్‌ ‌బాబా వ్యాఖ్యానించారు. ఇక షారుక్‌ ‌ఖాన్‌ ‌కొడుకు డ్రగ్స్ ‌తీసుకుంటూ పట్టుబడి జైలుకు వెళ్లివచ్చాడని అన్నారు. హీరోయిన్ల గురించి మాట్లాడిన ఆయన వాళ్ల గురించి.. తాను ఏ మాట్లాడనని చెప్పారు. వారు డ్రగ్స్ ‌తీసుకుంటారో లేదో దేవుడికే తెలుసని రాందేవ్‌ ఆరోపించారు.

ఉత్తరప్రదేశ్‌ ‌లోని మొరాదాబాద్‌ ‌లో నిర్వహించిన ఆర్యవీర్‌, ‌వీరాంగన సదస్సులో రాందేవ్‌ ఈ ‌వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ ఇం‌డస్టీ మొత్తం డ్రగ్స్ ‌గుప్పిట్లో చిక్కుకుందని అన్నారు. సినిమా పరిశ్రమను ఉద్దేశించి మాట్లాడిన ఆయన..రాజకీయాల్లో కూడా డ్రగ్స్ అడుగుపెట్టిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో డ్రగ్స్ ‌వినియోగం, మద్యం పంపిణీ మరింత ఎక్కువ అవుతోందన్నారు. డ్రగ్‌ అడిక్షన్‌ ‌నుంచి భారత్‌ ‌కు విముక్తి కలిగించేందుకు అందరూ కట్టుబడి ఉండాలని దాని కోసం ఉద్యమం చేస్తామని రాందేవ్‌ ‌బాబా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *